రహస్యంగా అంతా జరిగిపోతుంది..?

Posted By: Prashanth

రహస్యంగా అంతా జరిగిపోతుంది..?

 

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ నిర్మాణ సంస్థ హెచ్‌టీసీ మరోసారి ఆసక్తికర విషయాలతో ముందుకొచ్చింది. ఈ సంస్థ తాజా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పుకార్లు టెక్నాలజీ ప్రపచంలో వేడి పుట్టిస్తున్నాయి. ప్రముఖ సంస్థ వెర్జ్ (Verge) బహిర్గతం చేసిన సమాచారం మేరకు హెచ్‌టీసీ తాజాగా రూపొందిస్తున్న స్మార్ట్‌ఫోన్ హచ్‌టీసీ ప్రోటో (HTC Proto), హెచ్‌టీసీ వన్ వీ (HTC One V)కి అప్‌డేటెడ్ వర్షన్‌గా డిజైన్ కాబడినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.1 జెల్టీ బీన్ పై స్పందించే అవకాశముంది.

హచ్‌టీసీ ప్రోటోలో ఏ ఫీచర్లను ఆశించవచ్చు?

హెచ్‌టీసీ ప్రోటో 4 అంగుళాల WVGA SLCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముంది. డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8225 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1గిగాహెట్జ్), 5 మెగా పిక్సల్ కెమెరా, 4జీబి ఇంటర్న్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, 7.2ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌పీఏ కనెక్షన్, బీట్స్ ఆడియో వ్యవస్థ, ఉన్నత శ్రేణి మల్టీమీడియా ఫీచర్లు.

ఎప్పుడు విడుదలవుతుంది..?

హెచ్‌టీసీ అభిమానులు ఈ ఫోన్‌ను 2012 చివరినాటికి ఆశించవచ్చు. ధర, విడుదల తేదీ, ఇతర స్సెసిఫికేషన్‌లను వెల్లడించటంలో హెచ్‌టీసీ వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting