హెచ్‌టిసి కొత్త మార్కెట్ వ్యూహాం 'మ్యాంగో' ఓఎస్..!!

Posted By: Staff

హెచ్‌టిసి కొత్త మార్కెట్ వ్యూహాం 'మ్యాంగో' ఓఎస్..!!

పార్టీలలో రిచ్‌నెస్ కనిపించేందుకు గాను హెచ్‌ టిసి కొత్తగా మార్కెట్లోకి 'హెచ్‌టిసి రాడార్' అనే స్టయిలిష్ మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి త్వరలో విడుదల చేస్తుంది. 'హెచ్‌టిసి రాడార్' స్మార్ట్ ఫోన్ విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ మొబైల్ నిండా అన్ని ప్రత్యేకతలే. యూజర్స్‌కు క్లౌడ్ ఆధారిత సేవలు వినియోగించుకునేందుకు గాను ఇందులో 25 జిబి వరకు మెమరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

హై క్వాలిటీ ఫెర్పామెన్స్‌ని యూజర్స్‌కి అందించేందుకు గాను ఇందులో మైక్రోసాప్ట్ విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే GHz Scorpion ప్రాససెర్‌తో పాటు, 205 GPUని కలిగి ఉంది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అధ్బుతమైన ఫోటోలను తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్ ప్రత్యేకం.

ఈ మొబైల్‌లో మెమరీని విస్తరించుకునేందుకు గాను ఎటువంటి మైక్రో ఎస్‌డి స్లాట్ లేకపోయినప్పటికీ, ఇంటర్నల్‌గా మెమరీగా 8జిబిని ఇవ్వడం జరిగింది. హెచ్‌టిసి రాడార్ స్మార్ట్ ఫోన్‌ని అమాంతం వాడినట్లైతే బ్యాటరీ బ్యాక్ అప్ సుమారు 5గంటల 30 నిమిషాలు వస్తుందని సమాచారం. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను హెచ్‌టిసి రాడార్ సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో దీని ధర రూ 23,500/-.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot