‘4జీ’ పై కన్నేసిన సామ్‌సంగ్, హెచ్‌టీసీ..?

Posted By: Prashanth

‘4జీ’ పై కన్నేసిన సామ్‌సంగ్, హెచ్‌టీసీ..?

 

సమచారాన్ని రెప్పపాటులో చేరవేసే ప్రసారమాధ్యమాలు తమ ఉనికిని మరింత పెంచుకుంటున్నాయి. టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న విశృంఖుల మార్పులే ఇందుకు కారణం. నిన్న మొన్నటి వరకు మూడవ తరం (3జీ) మొబైల్స్ తయారీ పై మక్కువ కనబర్చిన పలు కంపెనీలు తాజాగా నాల్గవ తరం (4జీ) మొబైల్ ఉత్పత్తి పై దృష్టిని కేంద్రీకరంచాయి.

మొబైల్ ఫోన్ రంగంలో ఇప్పటికే తమ సత్తాను చాటుకున్న సామ్‌సంగ్, హెచ్‌టీసీ బ్రాండ్‌లు ముందుస్తు ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది ప్రధమాంకంలో 4జీ హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసేందుకు కసరత్తులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ 4జీ ఆధారిత డివైజ్‌లను లాస్‌వేగాస్‌లో నిర్వహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ప్రదర్శించే అవకాశముందని ప్రచారం జోరందుకుంది.

ఫోర్త్ జనరేషన్ మొబైల్ నెట్ వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ డివైజ్‌ల్లో లేటెస్ట్ వర్షన్ మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేసినట్లు తెలుస్తోంది. హెచ్‌టీసీ రేడియంట్, సామ్‌సంగ్ మండెల్‌గా డిజైన్ కాబడుతున్న ఈ ఫోన్ల ఫీచర్లు తెలియాల్సి ఉంది.

(గమనిక : సామ్‌సంగ్ మండెల్ కోడ్ నేమ్ మాత్రమే).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot