నోకియాకు స్పాట్ పెట్టిన హెచ్‌టీసీ!

By Super
|
htc-8x1

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ సాఫ్ట్‌వేర్ రారాజు మైక్రోసాఫ్ట్‌తో జతకట్టి రెండు సరికొత్త విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లను గురువారం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేసింది. 'విండోస్ ఫోన్ 8ఎక్స్ హెచ్‌టీసీ", 'విండోస్ ఫోన్ 8ఎస్ హెచ్‌టీసీ" మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు నోకియా ఇటీవల ఆవిష్కరించిన విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లు లూమియా 920,820లకు ప్రధాన పోటీదారు కానుంది. ఆధునిక సాంకేతికతకు పెద్దపీటవేస్తూ అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన హెచ్‌టీసీ విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు క్లుప్తంగా.......
htc-8x1

హెచ్‌టీసీ 8ఎస్:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే(రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్గింగ్ సౌలభ్యత), 720 పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16 మెగాపిక్సల్ ఇన్-బుల్ట్ మెమెరీ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్‌గేమ్స్, హెఫ్టీ 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ 8ఎక్స్:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్), 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, హెచ్‌టీసీ ఇమేజ్ చిప్ టెక్నాలజీ, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సామర్ధ్యం, 2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లూటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ 802.11 Wi-Fi a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్ గేమ్స్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ధర ఇతర వివరాలు:

ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌లను నవంబర్ నుంచి 50 దేశాల్లో విక్రయించనున్నారు. ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విండోస్ 8ఎస్ డోమినో, ఫియాస్టా రెడ్, ఆట్లాంటిక్ బ్లూ, హై-రైస్ గ్రే రంగుల్లో లభ్యంకానుంది. విండోస్ 8ఎక్స్ కాలిఫోర్నియా బ్లూ, గ్రాఫైట్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్, లైమ్ లైట్ ఎల్లో కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

సరికొత్త హెచ్‌టీసీ విండోస్ 8 ఫోన్‌లు ఈ వీడియోలో:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X