డెవలప్‌మెంట్ స్టేజిలోనే మురిపిస్తున్న హెచ్‌టిసి రూబీ

Posted By: Super

డెవలప్‌మెంట్ స్టేజిలోనే మురిపిస్తున్న హెచ్‌టిసి రూబీ

సాధారణంగా ఇంటర్నెట్లో నోకియా, సోనీ ఎరిక్సన్, శ్యామ్ సంగ్, మోటరోలా మొబైల్ కంపెనీలకు సంబంధించి మొబైల్ ఫోన్స్ వివరాలు డెవలప్ మెంట్ స్టేజీలో ఉండగానే వాటికి సంబంధించిన వివరాలు లీక్ అవుతుంటాయి. ఇప్పుడు కొత్తగా ఇదే దారిలో మరో మొబైల్ కంపెనీ చేరింది. ఏమిటా కంపెనీ అని అనుకుంటున్నారా అదేనండీ హెచ్‌టిసి. ఇంటర్నెట్లో ఓ ప్రముఖ వెబ్ సైట్ హెచ్‌టిసి త్వరలో విడుదల చేయనున్న హెచ్‌టిసి రూబీ కి సంబంధించిన ఇమేజెస్‌‌ను ఉంచింది. ఈ ఇమెజెస్ వల్ల హెచ్‌టిసి త్వరలో విడుదల చేయనున్న రూబీ అచ్చం గతంలో హెచ్‌టిసి కంపెనీ విడుదల చేసిన ప్లయర్ మాదిరే ఉంది. ఇక ఫ్లయర్ విషయానికి వస్తే హెచ్‌టిసి కంపెనీ విడుదల చేసిన టాబ్లెట్ పిసి.

హెచ్‌‌టిసి రూబీ ఇమెజెస్‌ని ప్రచురించిన వెబ్ సైట్ వాటికి క్లియర్‌గా ప్రచురించలేదు. అవి క్లియర్‌గా కనిపించక పోవడంతో అప్పుడే హెచ్‌‌టిసి రూబీ అచ్చం హెచ్‌‌టిసి ప్లయర్ మాదిరే ఉందని నిర్ణయాన్ని కొంతమంది నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఈ లీక్డ్ ఇమెజెస్‌ విషయంపై హెచ్‌‌టిసి కంపెనీ కూడా ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం విశేషం. దీనిని బట్టి చూస్తుంటే ప్రతి మొబైల్ తయారుదారు కంపెనీ కూడా కొత్త మొబైల్‌‌ని మార్కెట్లోకి విడుదల చేసే ముందు ప్రాదాన్యత కల్పించే భాగంగా ఇలా చేయడం పరిపాటి అయిందని భావించే వారు కూడా ఉన్నారు.

ఇంటర్నెట్లో దర్శమిస్తున్న ఇమెజెస్‌ని బట్టి చూస్తుంటే హెచ్‌‌టిసి రూబీ పవర్ పుల్ కెమెరాని కలిగిఉందని అనిపిస్తుంది. అంతేకాకుండా పిక్చర్ క్వాలిటీ సరిగ్గా ఉండేందుకుగాను డ్యూయల్ ఎల్‌‌ఈడి ఫ్లాష్‌ని కూడా కలిగి ఉందని భావిస్తున్నారు. దీనినిబట్టి చూస్తుంటే కెమెరా 8 మెగా ఫిక్సల్ వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p లేదా 1080p ఫార్మెట్లలలో అందిస్తుందని భావిస్తున్నారు. ఇక కీప్యాడ్ విషయానికి వస్తే పుల్ టచ్ స్క్రీన్ కీప్యాడ్ అయిఉంటుందని అంటున్నారు.

త్వరలోనే హెచ్‌‌టిసి రూబీకి సంబంధించిన ఫీచర్స్, ఖరీదు, విడుదల తేదీ మొదలగున వాటిని కంపెనీయే స్వయంగా వెల్లడించనుందని సమాచారం. ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే హెచ్‌‌టిసి రూబీ అనే పేరు కూడా రాబోయే మొబైల్‌కి నిర్ణయించలేదని, అది కేవలం ఇంటర్నెట్లో ఉన్న రూమర్ అని అంటున్నారు. ఇక మల్టీమీడియా విషయానికి వస్తే గతంలో హెచ్‌‌టిసి కంపెనీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌లో అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో కూడా పూర్తిగా తెలియడం లేదు.

స్మార్ట్ ఫోన్స్ విభాగంలో విడుదల చేయనున్న ఈ మొబైల్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో లేక విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో తెలసుకోవాలంటే మాత్రం మొబైల్‌కి సంబంధించిన వివరాలు మార్కెట్లోకి విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందేనని అంటున్నారు. మరిన్ని హెచ్‌‌టిసి రూబీ కి సంబంధించిన వివరాలు త్వరలోనే వన్ ఇండియా తెలుగులో....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot