హెచ్‌టిసి నుండి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్

Posted By: Staff

హెచ్‌టిసి నుండి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్

హెచ్‌టిసి టాగ్‌లైన్ 'క్వైట్లీ బ్రలియంట్'. ఈ ట్యాగ్ లైన్‌కి అనుగుణంగా తాను విడుదల చేసే ప్రతి మొబైల్ ఫోన్‌లో తనదైన శైలిని కనబరుస్తుంది హెచ్‌టిసి మొబైల్ కంపెనీ. హెచ్‌టిసి మొబైల్ కంపెనీ సొంతంగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్‌‌ 'హెచ్‌టిసి రన్నీమీడ్ 'ని త్వరలో విడుదల చేయనుంది. హెచ్‌టిసి రన్నీమీడ్ మొబైల్ ఫోన్ 1.5 GHz క్వాలికామ్ సింగల్ కోర్ ప్రాసెసర్‌తో పాటు, 768 MB RAMని కలిగి ఉంది. ఇక ఇందులో రన్ అయ్యేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వర్సన్ 2.3.4. హెచ్‌టిసి రన్నీమీడ్‌లో వాడిన టెక్నాలజీ హెచ్‌టిసి సెన్స్ 3.5 యూజర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను ఇందులో 4.7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో మాంచి స్టయిలిష్‌గా మొబైల్ ఫోన్‌ని రూపోందించడం జరిగింది. ఈ స్క్రీన్ స్పెషాలిటీ ఏమిటంటే మల్టీ టచ్ కమాండ్స్‌తో పాటు ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్స్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. 8 మెగా ఫిక్సల్ కెమెరాని ఇందులో నిక్షిప్తం చేయడం వల్ల చక్కని ఇమేజిలను తీసుకునే వీలుంది. అంతేకాకుండా ఈ కెమెరా సహాయంతో హై క్వాలిటీ 720p హెచ్‌డి వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు. వీటితో పాటు ఎల్‌ఈడి ప్లాష్ అదనపు ప్రత్యేకం. మామూలు స్మార్ట్ ఫోన్‌తో తీసిన ఫోటోలతో కంపేర్ చేసినట్లైతే హెచ్‌టిసి రన్నీమీడ్‌తో తీసిన ఫోటోలు చాలా క్లుప్తంగా, స్పష్టంగా చూడాడనికి చక్కగా ఉంటాయి.

ప్రస్తుతం ఇండియాలో 3జీ టెక్నాలజీ బాగా పాపులర్ అవ్వడంతో హెచ్‌టిసి రన్నీమీడ్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొని రావడం కోసం మొబైల్ ముందు భాగంలో విజిఎ కెమెరాని అమర్చడం జరిగింది. ప్రయాణాలలో సరదాగా పాటలు వినేందుకు గాను ఎఫ్‌ఎమ్ రేడియోని కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. బయట స్పీకర్స్‌కు మొబైల్‌ని కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

హెచ్‌టిసి రన్నీమీడ్ మొబైల్ ఫీచర్స్:
Running Android 2.3.4 Gingerbread OS
Touchscreen 4.7-inch display with 480

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting