8 మెగా ఫిక్సల్ కావాలా ఐతే సెన్సేషనే

Posted By: Staff

8 మెగా ఫిక్సల్ కావాలా ఐతే సెన్సేషనే

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ పోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మల్టిబుల్ ఛాయిస్ ఉంది. ఎందుకంటే అన్ని రకాల కంపెనీలకు చెందిన స్మార్ట్ పోన్స్ లభ్యమవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎక్కవ షేర్‌ని హెచ్‌టిసి, నోకియా, సోనీ ఎరిక్సన్, మోటరోలా, శ్యామ్ సంగ్ మొదలగు కంపెనీలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ కంపెనీలే ఇండియన్ మొబైల్ పరిశ్రమలో స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ బిజినెస్‌లో హెచ్‌టిసి కంపెనీ ఎక్కువ బిజినెస్ చేస్తుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్లైతే హెట్‌టిసి సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ యంగర్ ప్రోఫెషనల్స్ హెచ్ ‌టిసి మొబైల్‌ని ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు.

అందుకే హెచ్‌టిసి కంపెనీ విడుదల చేసినటువంటి రెండు స్మార్ట్ ఫోన్స్ గురించిన మీకు సమాచారం తెలియజేయస్తున్నాను. ఆ రెండు మోడల్స్ కూడా మార్కెట్లో పెద్ద సక్సెస్‌ని సాధిస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ రెండు మోడల్సే హెచ్‌టిసి సెన్సేషన్, డిజైర్. రెండు మొబైల్స్ కూడా పుల్ టచ్ స్క్రీన్ ఫోన్స్. రెండు కూడా రెండు రకాల ధరలలో లభ్యమవుతున్నాయి. హెచ్‌టిసి సెన్సేషన్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసం 4.3 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. అదే హెచ్‌టిసి డిజైర్ మాత్రం 3.7 ఇంచ్ AMOLED కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది.

హెచ్‌టిసి సెన్సేషన్ ఖరీదు హెచ్‌టిసి డిజైర్‌తో పోల్చితే చాలా ఎక్కువ. కానీ హెచ్‌టిసి సెన్సేషన్ స్మార్ట్ ఫోన్ ఏమేమి ఫీచర్స్ ఐతే కలిగి ఉన్నదో సరిగ్గా అటువంటి ఫీచర్సే హెచ్‌టిసి డిజైర్ కలిగి ఉండడం విశేషం. హెచ్‌టిసి సెన్సేషన్ కెమెరా 8 మెగా ఫిక్సల్‌ని కలిగి ఉండి హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 1080p ఫార్మెట్లో సోపర్ట్ చేస్తుంది. అదే హెచ్‌టిసి డిజైర్ మాత్రం 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720pలో సపోర్ట్ చేస్తుంది. వీడియో కాలింగ్ ఫీచర్ కోసం హెచ్‌టిసి సెన్సేషన్ ముందు భాగాన 1.2 మెగా ఫిక్సల్ కెమెరా అమర్చబడింది. అదే హెచ్‌టిసి డిజైర్‌ మాత్రం వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేయదు. అందుకు కారణం ఇందులో కెమెరా లేకపోవడమే.

మల్టీమీడియా, ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను రెండు మొబైల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఆఫ్షన్స్ అయినటువంటి బ్లాటూత్, వై-పై యుఎస్‌బి సింక్‌లను రెండు మొబైల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక 3జీ డేటా ట్రాన్పర్‌ని హెచ్‌టిసి సెన్సేషన్ 14 Mbps స్పీడ్‌తో ఆఫర్ చేయగా, అదే 3జీ డేటా ట్రాన్పర్‌ని హెచ్‌టిసి డిజైర్ కేవలం 7 Mbp స్పీడ్‌తో ఆఫర్ చేస్తుంది. రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ రన్ అవుతాయి. ఐతే హెచ్‌టిసి సెన్సేషన్ మాత్రం 2.3 జింజర్ బ్రెడ్ వర్సన్‌తో రన్ అవ్వగా, అదే హెచ్‌టిసి డిజైర్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఇక ఖరీదు విషయానికి వస్తే మాత్రం రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. హెచ్‌టిసి సెన్సేషన్ ధర రూ 28,900 ఉండగా అదే హెచ్‌టిసి డిజైర్ మాత్రం రూ 16499గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot