అందరి చూపు అటువైపే!!

Posted By: Super

అందరి చూపు అటువైపే!!

 

స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన గుగూల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తాజా వర్షన్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కంపెనీలన్ని ఈ ఓఎస్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ నిర్మాణ రంగ సంస్థ హెచ్‌టీసీ (HTC)తాను డిజైన్ చేసిన ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్ అప్‌డేట్‌కు శ్రీకారం చుట్టింది. తొలత ఈ అప్‌డేట్ హెచ్‌టీసీ సెన్సేషన్ అదేవిధంగా హెచ్‌టీసీ సెన్సేషన్ XE మోడల్ స్మార్ట్‌ఫోన్‌లకు వర్తిస్తుందని సంబంధిత వర్గాల సమాచారం, తరువాత వరసలో హెచ్‌టీసీ సెన్సేషన్ 4జీ, హెచ్‌టీసీ సెన్సేషన్ XL స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నట్లు తెలిసింది. హెచ్‌టీసీ సెన్సేషన్ 4జీ, XL

హ్యాండ్‌సెట్‌లకు ప్రస్తుత మార్కెట్లో విపరీతమై క్రేజ్ ఏర్పడిన నేపధ్యంలో ఈ నవీకరణ కెంపెనీకి మరింత లబ్ధి చేకూర్చుతుంది.

హెచ్‌టీసీ సెన్సేషన్ 4జీ:

* 4.3 అంగుళాల శక్తివంతమైన టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),

* 8మెగా పిక్సల్ కెమెరా,

* డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్.

హెచ్‌టీసీ సెన్సేషన్ XL:

* 4.7అంగుళాల టచ్ స్ర్కీన్,

* అత్యాధునిక మల్టీమీడియా వ్యవస్థ,

* 8మెగా పిక్సల్ కెమెరా,

* 768ఎంబీ ర్యామ్,

* శక్తివంతమైన ప్రాసెసర్,

ఐసీఎస్ అప్‌డేట్ పొందే మరిన్ని హెచ్‌టీసీ ఫోన్లు:

హెచ్‌టీసీ థండర్ బోల్ట్, రైడర్, డ్రాయిడ్ ఇన్‌క్రెడిబుల్ 2, రిజౌండ్, ఆమెజ్ 4జీ, డిజైర్ ఎస్, డిజైర్ హెచ్‌డి, వివిడ్, ఇన్‌క్రెడిబుల్ ఎస్, రైమ్, ఇవో 3డి, ఇవో డిజైన్ 4జీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot