‘హెచ్‌టీసీ’..ఎంపిక మరికాస్త క్లిష్టం!!!

Posted By: Staff

‘హెచ్‌టీసీ’..ఎంపిక మరికాస్త క్లిష్టం!!!

 

రెండు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను పక్క పక్కనపెట్టి  వాటిలో ఒకటి ఎంపిక చేసుకోమంటే ఎవరికైనా ఆయోమయం తప్పదు. ఆ రెండు డివైజ్‌లు ఒకే బ్రాండ్‌కు చెందినవైతే  ఆ ఎంపిక మరికాస్త జటిలమవుతుంది. ఇదే కన్ఫ్యూజన్ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో

తలెత్తింది. ఒకే బ్రాండ్‌కు చెందిన  రెండు స్మార్ట్‌ఫోన్‌లు నేనంటే నేను గొప్పంటూ పోటీ పడుతున్నాయి.

హెచ్‌టీసీ ప్రవేశపెట్టిన ‘సెన్సేషన్  XL’, ‘టైటాన్’ స్మార్ట్‌‌ఫోన్‌లు ఎంపిక సమయంలో  వినియోగాదారుడిని ఆయోమయానికి గురిచేస్తున్నాయి. ఫీచర్లు అదేవిధంగా పనితీరు విషయంలో ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ రెండు గ్యాడ్జెట్‌లు డిజైన్ కాబడ్డాయి.

హెచ్‌టీసీ సెన్సేషన్ XL ముఖ్య ఫీచర్లు:

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * 4.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, * 16జీబి ఇంటర్నల్ మెమరీ, * ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ 8255 చిప్‌సెట్, * 1.5 GHz స్కార్పియన్ ప్రాసెసర్, * అడ్రినో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * హైస్పీడ్ 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ,  * బ్లూటూత్ v3.0, * మైక్రో  యూఎస్బీ v2.0, * డ్యూయల్  LED ఫ్లాష్ 8 మెగా పిక్సల్ కెమెరా, హై-డెఫినిషన్ వీడియో రికార్డింగ్.

హెచ్‌టీసీ టైటాన్ ముఖ్య ఫీచర్లు:

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * 4.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, * విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం, * 16జీబి ఇంటర్నల్ మెమరీ, * క్వాల్కమ్ 8255 చిప్‌సెట్, *  1.5 GHz స్కార్పియన్  ప్రాసెసర్, * అడ్రినో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * ప్రాక్సిమిటీ సెన్సార్, గైనా సెన్సార్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * హైస్పీడ్ 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * LED ఫ్లాష్ 8 మెగా పిక్సల్ కెమెరా.

ఫీచర్ల విషయంలో సమాన ప్రాతిపదికను కలిగి  ఉన్న ఈ రెండు స్మార్ట్ మొబైల్స్ ధరల విషయంలో తేడాలను మనం గమనించవచ్చు. భారతీయ మార్కెట్‌లో హెచ్‌టీసీ సెన్సేషన్ ధర రూ.35,000 పైగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హెచ్‌టీసీ టైటాన్ ధరకు  సంబంధించి పూర్తి వివరాలు తెలియనప్పటికి సెన్సేషన్‌తో పోలిస్తే ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot