‘హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ల’లో హిందీ భాష!!

Posted By: Staff

‘హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ల’లో హిందీ భాష!!

మొబైల్ యూజర్లు అధికంగా ఉన్నఇండియాలో ప్రాంతీయ బాషలను, నోకియా తదితర బ్రాండ్లు తమ తమ హ్యాండ్ సెట్లలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల తయారీదారైన ‘హెచ్‌టీసీ’(HTC) తమ సరికొత్త హ్యాండ్‌సెట్లలో హిందీ భాషను సపోర్టు చేసే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది.

హిందీ టెక్స్టింగ్ సదుపాయంతో పాటు హిందీ ‘కీ’ బోర్డును ఈ హ్యాండ్‌సెట్లో ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యత ద్వారా మెసేజింగ్ తదితర మొబైల్ లావాదేవీలను హిందీ భాషలో చూసుకోవచ్చు. తాజా అపడేట్‌కు సంబంధించిన సమాచారాన్ని హెచ్‌టీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు, హెచ్‌టీసీ ఆసియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ డారెన్ తెలిపారు. తమ తాజా ఆవిష్కరణ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉందని డారెన్ ధీమా వ్యక్తం చేశారు.

22 మిలయన్ల మొబైల్ యూజర్లున్న భారత దేశంలో, కేవలం 11 శాతం మందికి మాత్రమే ‘ఇంగ్లీష్’ పై అవగాహన ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా, ప్రధాన వాడుక భాషల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసకున్న ‘హిందీ భాష’ను హెచ్‌టీసీ విజయవంతగా తమ స్మార్ట్‌ఫోన్లలో ప్రవేశపెట్టడం శుభపరిణామం.

స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న, ఇండియన్ మార్కెట్ పై పట్టు సాధించే క్రమంలో హెచ్‌టీసీ ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot