Home
Mobile

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రముఖ సంస్థ రీఎంట్రీ.. ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, లాంచ్ వివరాలు..!

తైవాన్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ HTC త్వరలో భారత్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సంస్థ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో (HTC Upcoming Smartphone in India) పోస్టు చేసింది. అయితే స్మార్ట్‌ ఫోన్‌ వివరాలు సహా విడుదల తేదీని వెల్లడించలేదు.

కొన్ని నివేదికల ఆధారంగా గత సంవత్సరం విడుదలైన HTC U23 మరియు U23 ప్రో స్మార్ట్‌ ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌ HTC U24 గా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా HTC U24 మరియు U24 ప్రో గా తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్‌ ఇటీవల గీక్‌బెంచ్‌ మరియు బ్లూటూత్‌ SIG సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లలో 2QDA100 మోడల్‌ నంబర్‌తో కనిపించింది.

HTC to launch New smartphone in india

ఈ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌లు గత మోడల్‌ కంటే అప్‌గ్రేడ్‌లతో రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుందని తెలియజేస్తున్నాయి. దీంతోపాటు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

ఈ HTC U24 మరియు U24 ప్రో హ్యాండ్‌ సెట్‌లు IP67 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌గా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.3 ఫీచర్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. గతంలో భారత్‌ మార్కెట్‌లో రాణించిన HTC సంస్థ.. వివిధ కారణాలతో ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది. త్వరలో కొత్త ఫోన్‌ ద్వారా తిరిగి రానుంది.

** గత సంవత్సరం విడుదల అయిన HTC U23 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ హెడ్‌డి+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. అలాగే డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణతో వస్తుంది. U23 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

HTC U23 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాల విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందువైపు 32MP కెమెరా ఏర్పాటుచేశారు. వెనుకవైపు నాలుగు కెమెరాలను అమర్చారు. OISతో 108MP ప్రధాన కెమెరా, 8MP ఆ‌ల్ట్రావైడ్‌ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్, 5MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. LED ప్లాష్‌తో రానుంది. అలాగే 4K వీడియో క్వాలిటీతో రికార్డు చేయవచ్చు.

30W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మరియు 15W వైర్‌లైస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4600mAh బ్యాటరీని అమర్చారు. 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో విడుదల అయింది. IP67 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ కుడివైపున ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ అమర్చారు. ఈ ఫోన్‌ కాఫీ బ్లాక్‌ మరియు Muxer వైట్‌ రంగుల్లో చైనాలో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HTC to launch New smartphone in india expected to be HTC U24 series
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X