హెచ్‌టీసీ బాటలో శామ్‌సంగ్, మోటరోలా, ఎల్‌జీ..?

Posted By: Prashanth

హెచ్‌టీసీ బాటలో శామ్‌సంగ్, మోటరోలా, ఎల్‌జీ..?

 

నమ్మకమైన ఉత్పత్తులను అభివృద్ధి చెయ్యటంలో విశ్వసనీయ బ్రాండ్‌గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌టీసీ (HTC) మరో ప్రయోజనకర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థ ఈ ఫిబ్రవరిలో విడుదల చేస్తున్న రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లలో శక్తివంతమైన క్వాడ్ కోర్ (quad core) ప్రాసెసర్‌లను నిక్షిప్తం చేస్తుంది. వేగవంతమైన పనితీరును కనబర్చే ‘క్వాడ్‌కోర్ ప్రాసెసర్’లకు ప్రస్తుత మార్కెట్లో ఎనలేని డిమాండ్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పూర్తి సమచారాన్ని హెచ్‌టీసీ ప్రతినిధి బృందం ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ సమావేశంలో వెల్లడించే అవకాశముందని డిగిటైమ్స్ పేర్కొంది. వ్యూహాత్మకంగా హెచ్‌టీసీ విడుదల చేస్తున్న ఈ ‘ఎడ్జ్ ‌ఫోన్’లు ఫిబ్రవరిలో లాంఛ్ అవుతున్నప్పటికి పూర్తి‌స్థాయి మార్కెట్లోకి ఏప్రిల్‌లో వస్తాయి.

వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం కొత్త జనరేషన్ పరితపిస్తున్న నేపధ్యంలో దిగ్గజ బ్రాండ్‌లైన శామ్ సంగ్, మోటరోలా, ఎల్‌జీలు క్వాడ్ కోర్ ఆధారిత స్మార్ట్ మొబైళ్లను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులే లక్ష్యంగా జరుగుతున్న ఈ సాంకేతిక పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి మరి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting