రూటు మార్చిన స్టైలిష్ హిరో!

Posted By: Staff

రూటు మార్చిన స్టైలిష్ హిరో!

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ప్రాధాన్యతనిచ్చే స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ, నోకియా బాటలో విండోస్ 8 ఫోన్‌ల తయారీ పై దృష్టిసారించింది. భవిష్యత్‌లో ఈ బ్రాండ్ నుంచి మూడు విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. మరో వైపు మెగా‌బ్రాండ్ సామ్‌సంగ్, విండోస్ 8 ఫోన్‌లను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు వినికిడి.

హెచ్‌టీసీ ప్రవేశపెట్టబోతున్న విండోస్ ఫోన్‌ల వివరాలు:

హెచ్‌టీసీ జినిత్ (HTC Zenith)

హెచ్‌టీసీ రియో (HTC Rio)

హెచ్‌టీసీ ఆకార్డ్ (HTC Accord)

వేరు వేరు స్పెపిఫికేషన్‌లు, వేరు వేరు ధరలతో డిజైన్ కాబడిన ఈ ఫోన్‌లను ఈ ఏడాదిలోనే విడుదల చేసే అవకాశముంది. వీటిలో హెచ్‌టీసీ రియో తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే... హెచ్‌టీసీ జినిత్ 4.7 అంగుళాల హై డెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ2

డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హెచ్‌టీసీ ఆకార్డ్ 4.3 అంగుళాల హై డెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ2 డిస్‌ప్లేతో రూపుదిద్దుకుంది. చివరిగా హెచ్‌టీ‌సీ రియో 4 అంగుళాల క్వాగా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన కెమరా 4 మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot