HTC దివాళి ఆఫర్, U Ultraపై రూ. 23 వేలు తగ్గింపు
అన్ని మొబైల్ కంపెనీలు దివాళి ఆఫర్ సంధర్భంగా తమ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా HTC కంపెనీ తమ యూజర్ల కోసం దివాళి ఆఫర్‌ని తీసుకొచ్చింది.
అన్ని మొబైల్ కంపెనీలు దివాళి ఆఫర్ సంధర్భంగా తమ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా HTC కంపెనీ తమ యూజర్ల కోసం దివాళి ఆఫర్‌ని తీసుకొచ్చింది. మార్చిలో రిలీజ్ చేసిన HTC U Ultraపై 22,999 రూపాయల డిస్కౌంటును అందిస్తోంది. ఈ ఫోన్ 59,990 రూపాయల ధరలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే నెలలోనే ఈ ఫోన్ ధర రూ. 52,990కి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

హెచ్‌టీసీ U Ultra ఫీచర్లు
4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
5.7 ఇంచ్ Quad HD Display
Second Screen with Dual Display Mode
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 64-bit, 2.15 Ghz ప్రాసెసర్,
Super LCD 5, 3D Corning Gorilla Glass 5
HTC Senseతో ఆండ్రాయిడ్ నోగట్ 7.1ఆపరేటింగ్ సిస్టమ్
12 ఎంపీరియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
G LTE with VoLTE, GPS/ A-GPS, Bluetooth v4.2, Wi-Fi 802.11ac,
NFC, DLNA, Miracast, HTC Connect,
USB 3.1 Type-C connectivity

రెండు డిస్ప్లేలు
ఎల్జీ వి20లో ఉన్నట్లే దీనిలో కూడా రెండు డిస్ప్లేలు ఉన్నాయి. ఒకటి 5.7 అంగుళాల క్యూహెచ్‌డీ ఎల్సీడీ డిస్ప్లే కాగా, దానిపైన 2 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. అయితే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. 64జీబీ వేరియంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌తో వస్తోంది. అలాగే 128జీబీ మోడల్ సాఫైర్ గ్లాస్ కోటింగ్‌తో లభిస్తుంది. క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌తో యు ఆల్ట్రా పటిష్టంగా ఉంది.

మరో ప్రధాన ఆకర్షణ కెమెరా
హెచ్‌టీసీ యు ఆల్ట్రాలో మరో ప్రధాన ఆకర్షణ కెమెరా. దీనిలో వెనుకవైపు బీఎస్‌ఐ సెన్సార్‌తో కూడిన 12 ఆల్ట్రాపిక్సెల్ 2 ఆటోఫోకస్ కెమెరాను అమర్చారు. f/1.8 అపెర్చ్యూర్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో వస్తున్న ఈ కెమెరాతో ఫొటోలు అద్భుతంగా వస్తాయి.

16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
అలాగే సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 3డీ ఆడియోతో కూడిన 4కే వీడియోలను ఈ కెమెరాతో బంధించొచ్చు. దీనిలో అమర్చిన 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 3జీ, 4జీ కనెక్షన్‌పై కూడా 26 గంటల టాక్‌టైం ఇస్తుందట. అలాగే క్విక్ చార్జ్ టెక్నాలజీ 3.0తో బ్యాటరీ చాలా త్వరగా ఫుల్ అవుతుందట.


Click it and Unblock the Notifications








