హెచ్‌టీసీ నుంచి U11 Eyes, భారీ డిస్‌ప్లే, డ్యూయెల్ సెల్ఫీతో..

Written By:

ప్రముఖ మొబైల్ దిగ్గజం హెచ్‌టీసీ 2018వ సంవత్సరాన్ని సరికొత్తగా ఆరభించబోతోంది. ఈ ఏడాదిలో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వస్తున్న రూమర్ల ప్రకారం ఐ సీరిస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ హెచ్‌టీసీ యు11ఐను జనవరి 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డివైస్‌ను అమెరికా మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూడా ఒకేసారి ప్రవేశపెడుతుందా?లేదా అనేదానికి కంపెనీ ఇంకా క్లారిటి ఇవ్వలేదు. భారీ స్క్రీన్‌, డ్యుయల్‌ సెల్ఫీ కెమెరాలతో లాంచ్‌ కానున్న ఈ డివైస్‌ను మిడ్‌ సెగ్మెంట్‌ బడ్జెట్‌ ధరలోనే కస్టమర్లకు అందుబాటులో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధరను రూ.32వేలుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. బ్లాక్‌, రెడ్‌, సిల్వర్‌ రంగుల్లో లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది.

Set Top Box కొనుగోలు చేయాలనుకుంటున్నారా, మీ కోసమే ఈ బెస్ట్ డీల్స్ !

హెచ్‌టీసీ నుంచి U11 Eyes, భారీ డిస్‌ప్లే, డ్యూయెల్ సెల్ఫీతో..

హెచ్‌టీసీ యు11ఐ ఫీచర్లు అంచనా..
6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, సూపర్ ఎల్‌సీడీ3
1080 x 2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌
స్నాప్‌ డ్రాగన్ 652 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగట్‌
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా
3,930ఎంఏహెచ్‌ బ్యాటరీ

English summary
HTC U11 Eyes could bring a big screen and dual selfie cameras More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot