6జీబి ర్యామ్,128జీబి స్టోరేజ్ కెపాసిటీతో HTC U11 లాంచ్ అయ్యింది

హెచ్‌టీసీ కంపెనీ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ HTC U11ను శుక్రవారం ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.51,990. జూన్ 17 నుంచి అమెజాన్ ఇండియాతో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. విప్లవాత్మక "Edge Sense" టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్, ఇప్పటికే మార్కెట్లో దొరుకుతోన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎల్‌జీ జీ6 ఫోన్‌‌లకు పోటీగా నిలవనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTC U11 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.45గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.2 , నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ 3.1), 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

డిజైనింగ్ కేక..

లిక్విడ్ గ్లాస్ సర్‌ఫేస్‌‌తో డిజైన్ కాబడిన HTC U11 ఫోన్ మరింత నాజూకుగా కనిపిస్తుంది. ఫోన్ ముందు, వెనుకా 3డీ గ్లాస్‌ను ఏర్పాటు చేయటంతో ఫోన్ మరింత అందంగా కనిపించటమే కాదు చేతిలో మరింత సెక్యూర్‌గా కూడా ఉంటుంది.

ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీ..

HTC U11 స్మార్ట్‌ఫోన్‌కు ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీ ప్రధాన హైలైట్. ఈ టెక్నాలజీతో ఫోన్ కెమెరాను లాంచ్ చేయాలంటే చేతిలో ఉన్న ఒక్కసారి స్క్వీజ్(నొక్కితే) చేస్తే చాలు యాప్ ఆటోమెటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఫోటో తీసుకోవాలంటే మరొక సారి స్క్వీజ్ చేయవల్సి ఉంటుంది. ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీని కేవలం కెమెరాకు మాత్రమే కాదు ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్, గూగుల్ మ్యాప్స్ ఇంకా ఇతర అప్లికేషన్‌లతో ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. screenshot తీయటం, ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేయటం, వాయిస్ రికార్డింగ్‌ను స్టార్ట్ చేయటం వంటి పనులను కూడా ఈ ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీ చక్కబెట్టేస్తుంది.

బెస్ట్ క్వాలిటీ కెమెరా..

కెమెరా క్వాలిటీ విషయంలోనూ HTC U11 స్మార్ట్‌ఫోన్‌ ఎక్కడా రాజీపడలేదు. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను 3డీ ఆడియో క్వాలిటీతో రికార్డ్ చేసుకునే వీలుంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, f/1.7 అపెర్చుర్ లెన్స్, అల్ట్రా స్పీడ్ ఆటోఫోకస్, RAW క్యాప్చుర్, హై-రెసిస్టెంట్ స్టీరియో రికార్డింగ్, 1080 పిక్సల్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ కెమెరా హైక్వాలిటీ వీడియో కాల్స్ తో పాటు సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

కేక పుట్టించే ఆడియో..

HTC U11 స్మార్ట్‌ఫోన్‌‌లో బూమ్ సౌండ్ హై-ఫై ఎడిషన్ స్పీకర్లను హెచ్‌టీసీ పొందుపరిచింది. ఈ స్పీకర్స్ ఓపెన్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత క్వాలిటీతో ఆఫర్ చేస్తాయి. ఈ స్పీకర్లలో డైనమిక్ రేంజ్ ఆడియోను 150% మెరుగుపరిచినట్లు హెచ్‌టీసీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HTC U11 launched in India at Rs. 51,990 for 128GB: Features that make it desirable. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot