చైనా నుంచే వరల్డ్ ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్, వేగం తెలిస్తే షాకే !

By Hazarath
|

ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది స్మార్ట్‌ఫోన్లే అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 2జీ నుంచి 3జీకి కాలం పరిగెడితే అక్కడి నుంచి అంతే వేగంతో 4జీకి పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు 4జీ నుంచి 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 5జీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ముందుగా ఏ దేశం ఈ 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుందనే దానిపై అనేక అంచనాలు నెలకొన్న నేపథ్యంలో చైనా ఓ అడుగు ముందుకేసింది.

చైనా కంపెనీల నుంచి మార్కెట్లోకి 5జీ ఫోన్ అతి త్వరలో రానుందనే వార్తలు లీక్ అయ్యాయి. ప్రధానంగా ZTE, HTC, వంటి కంపెనీల నుంచి 5జీ ఫోన్ రానుందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కధనాలు వస్తున్నాయి.

 

అదిరే స్మార్ట్‌ఫోన్,అంతకన్నా అదిరే ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

HTC కంపెనీ 5జీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు..

HTC కంపెనీ 5జీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు..

HTC కంపెనీ 5జీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అనధికార రిపోర్టులు ప్రకారం తైవాన్ లో దర్శనమిచ్చింది. HTC U12 పేరిట కంపెనీ 5జీ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తోందని చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ultra-thin bezels displayతో HTC U12 ఫోన్ రానుందని ఫోన్ల వివరాలను లీక్ చేసే Evan Blass ట్విట్టర్లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. కాగా ఈ పోస్ట్ నెట్ వర్కింగ్ సైట్లో ఫోన్ల వివరాలను అందించే iamaniff వాల్ నుంచి షేర్ చేసినట్లు తెలుస్తోంది.

HTC 5జీ ఫోన్ మీద..

HTC 5జీ ఫోన్ మీద..

కాగా ఫోన్ల వివరాలను అందించే iamaniff సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో HTC 5జీ ఫోన్ మీద పనిచేస్తుందంటూ ఓ ఇమేజ్ ని పోస్ట్ చేశారు. ఈ విషయంపై Taiwan 5G Industry Alliance - Chunghwa Telecom Pilot Teamతో HTC సమావేశం కూడా నిర్వహించిదంటూ తెలిపారు. ఈ సమావేశం ప్రధానంగా Vive PRO, Vive Focus, unlisted VR devicesలాంటి అంశాల మీదనే జరిగిందని ఆయన తెలిపారు.

వినియోగదారుల కోసం కాదని..
 

వినియోగదారుల కోసం కాదని..

అయితే ఈ ఫోన్ వినియోగదారుల కోసం కాదని స్పీడ్ టెస్టింగ్ కోసమేనని తెలుస్తోంది. ఈ ఫోన్‌తో ఇంటర్నెట్ స్పీడ్ వేగం ఎంతో తెలుసుకునేందుకుప్రయత్నిస్తున్నారని సమాచారం. చైనాలో 5జీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగానే U12తో ప్రయోగాలు జరుపుతోందని మరొక కంపెనీ రిపోర్ట్ చేసింది.

download speed 809.58 Mbps

download speed 809.58 Mbps

తైవాన్ వెబ్‌సైట్ Sogi ప్రకారం HTC U12 download speed 809.58 Mbpsగా ఉందని ఇది సరాసరి 1జిబికి చేరే అవకాశం ఉందని రిపోర్ట్ చేసింది. కాగా ఈ ఫోన్ latest Qualcomm Snapdragon processor 845 సీరిస్‌తో వస్తుందని తెలిపింది. 18: 9 ratio తో 6 inch displayతో ఫోన్ రానుంది. కాగా ఈఫోన్ ఇంకా బయటకి రాకపోవడంతో దీని గురించి కంపెనీ ఎటువంటి వివరాలను చెప్పడం లేదని తెలుస్తోంది.

 Mobile World Congress (MWC 2018) లో ప్రదర్శనకు..

Mobile World Congress (MWC 2018) లో ప్రదర్శనకు..

అనధికార రిపోర్టుల ప్రకారం ఈ ఫోన్లో 6 ultra-thin bezels display, X20 LTE modemతో 1.2Gbps download speed సపోర్ట్‌తో రానుంది. కాగా ఈ ఫోన్ ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరిగే Mobile World Congress (MWC 2018) లో ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఈవెంట్లో శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ Galaxy S9 and Galaxy S9+లు కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ZTE ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌

ZTE ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌

కాగా గతేడాది MWC 2017 మేజర్ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా చైనా కంపెనీ ZTE ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. Gigabit పేరుతో విడుదలైన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందుకోగలదని చెప్పింది.

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835

ZTE Gigabit ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌కు ఇంటిగ్రేట్ చేసిన Snapdragon X16 LTE మోడెమ్ వేగవంతమైన కనెక్టువిటీని ఆఫర్ చేస్తుంది.

LTE డివైస్ లోతో పోలిస్తే 10 రెట్లు వేగం

LTE డివైస్ లోతో పోలిస్తే 10 రెట్లు వేగం

ఈ మోడమ్‌లో పొందుపరిచిన 4x4 MIMO యాంటెనా టెక్నాలజీ ఇంకా 256-QAM మాడ్యులేషన్ వ్యవస్ధలు డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధారణ LTE డివైస్ లోతో పోలిస్తే 10 రెట్లు వేగంతో ఆఫర్ చేస్తాయి. 360 డిగ్రీ పానోరమిక్ వీఆర్ వీడియో, ఇన్‌స్టెంట్ క్లౌడ్ స్టోరేజ్, అల్ట్రా హై-ఫై మ్యూజిక్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందపరిచారు.

క్వాల్‌కామ్ ఉద్యోగి ఒకరు..

క్వాల్‌కామ్ ఉద్యోగి ఒకరు..

దీంతో పాటు గతేడాది క్వాల్‌కామ్ ఉద్యోగి ఒకరు 5జీ ఫోన్ పట్టుకుని ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం విదితమే. క్వాల్ కామ్ ఫస్ట్ వేవ్ 5జీ రిఫరెన్స్ డిజైన్‌తో వచ్చిన ఈ మొబైల్ ను 5జీ ఎంఎ వేవ్ పెర్‍ఫార్మెన్స్‌ను టెస్ట్ చేసి ఆప్టిమైజ్ చేయడానికి రిలీజ్ చేశారు. అయితే ఇదే ప్రపంచపు తొలి 5జీ ఫోన్ అంటూ క్వాల్‌కామ్ ఈ ఇమేజ్‌ని పోస్ట్ చేసింది.

డ్యూయల్ కెమెరాలతో పాటు

డ్యూయల్ కెమెరాలతో పాటు

దీనిలో డ్యూయల్ కెమెరాలతో పాటు , బ్యాక్ సైడ్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ లోగో కూడా ఉంది. ఈ ఫోన్ 2/3/4/5జీలకు పనిచేసే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు క్వాల్‌కామ్ ఉద్యోగి తన పోస్టులో తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
HTC U12 with 5G support reportedly showcased in Taiwan More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X