ఫైర్ పుట్టించడానికి మోటరోలానా లేక హెచ్‌టిసినా..?

Posted By: Staff

ఫైర్ పుట్టించడానికి మోటరోలానా లేక హెచ్‌టిసినా..?

మార్కెట్లో వివిధ కంపెనీలు ఒకే విధమైన ఫీచర్స్‌తో మొబైల్స్‌ని విడుదల చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఇటీవల కాలంలో హెచ్‌టిసి, మోటరోలా నుండి మొబైల్స్‌ని విడుదల చేయడం జరిగింది. హెచ్‌టిసి నుండి హెచ్ టిసి వైల్డ్ ఫైర్, మోటరోలా నుండి మోటరోలా ఫైర్ అనే పేర్లతో మొబైల్స్ విడుదలయ్యాయి. రెండు మొబైల్స్ కూడా ఒకే విధమైన పీచర్స్‌తో మార్కెట్లో హాల్ చల్ చేస్తున్నాయి.

హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ విషయానికి వస్తే టచ్ స్క్రీన్ ఫీచర్‌‌ని కలిగి ఉండి మల్టీ టచ్ ఇన్ పుట్ పద్దతితో ఆప్టికల్ ట్రాక్ ప్యాడ్ దీని సొంతం. ఈ హ్యాండ్‌సెట్ లో ఉన్న టచ్ సెన్సిటివ్ కంట్రోల్ మొబైల్‌పై యూజర్స్‌కు ఆసక్తి మరింత పెంపొందేలా చేస్తుంది. అదే మోటరోలా పైల్ ఎక్స్‌టి 311 మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మొబైల్ పోన్. అదే హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ మొబైల్‌ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 2.1 ఈక్లెయిర్‌తో రన్ అవుతుంది.

హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ మొబైల్ హెచ్‌టిసి క్వాలికామ్ 72225 528 MHz ప్రాసెసర్‌‌తో రన్ అవుతుంది. అదే మోటరోలా పైర్ 600 MHz ARM 11 ప్రాసెసర్‌ని కలిగి ఉండడమే కాకుండా Adreno GPU and a Qualcomm MSM7227-1 చిప్ సెట్ దీని సొంతం. రెండు మొబైల్స్ కూడా బార్ హ్యండ్ సెట్స్ విభాగానికి చెందినవి.

హెచ్‌టిసి వైల్డ్ పైర్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.2 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది.మొబైల్ కీ బోర్డ్ విషయానికి వస్తే క్వర్టీ కీబోర్డ్. అదే మోటరోలా ఫైర్ 2.8 ఇంచ్ టిఎఫ్‌టి స్క్రీన్ డిస్ ప్లే సైజుని కలిగి ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే హెచ్‌టిసి వైల్డ్ పైర్ 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ప్లాష్, ఆటోఫోకస్ లాంటివి ప్రత్యేకం.అదే మోటరోలా ఫైర్‌లో కేవలం 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది.

రెండు మొబైల్స్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, వీటిల్లో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్స్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యాజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయవు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. హెచ్‌టిసి వైల్డ్ పైర్ మొబైల్ ధర ఇండియన్ మొబైల్ మార్కెట్లో సుమారుగా రూ 9,999గా నిర్ణయించగా, అదే మోటరోలా ఫైర్ మొబైల్ ధర రూ 8,999గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot