వచ్చే వారం భారత్‌లోకి... నోకియాకు పెద్ద సవాల్?

Posted By: Prashanth

వచ్చే వారం భారత్‌లోకి... నోకియాకు పెద్ద సవాల్?

 

విండోస్ ఫోన్8 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపధ్యంలో తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దివాళీ కానుకగా హెచ్‌టీసీ 8ఎక్స్, 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే వారం భారత మార్కెట్లో విడుదలవుతున్నట్లు విశ్వసనీయగా తెలిసింది.

హెచ్‌టీసీ 8ఎక్స్ ఇకా 8ఎస్ స్పెసిఫికేషన్‌లు:

బరువు ఇంకా చుట్టుకొలత..

హెచ్‌టీసీ 8ఎక్స్: చుట్టుకొలత 132.35 x 66.2 x 10.12మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు,

హెచ్‌టీసీ 8ఎస్: చుట్టుకొలత 120.5 x 63 x 10.28మిల్లీమీటర్లు, బరువు 113గ్రాములు,

డిస్‌ప్లే:

హెచ్‌టీసీ 8ఎక్స్: 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్.

హెచ్‌టీసీ 8ఎస్: 4 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్.

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ 8ఎక్స్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

హెచ్‌టీసీ 8ఎస్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్:

హెచ్‌టీసీ 8ఎక్స్: డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1.5గిగాహెడ్జ్),

హెచ్‌టీసీ 8ఎస్: డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1గిగాహెడ్జ్),

కెమెరా:

హెచ్‌టీసీ 8ఎక్స్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

హెచ్‌టీసీ 8ఎస్: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్:

హెచ్‌టీసీ 8ఎక్స్: 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్,

హెచ్‌టీసీ 8ఎస్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్,

కనెక్టువిటీ:

హెచ్‌టీసీ 8ఎక్స్: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-పై ఇంకా మైక్రోయూఎస్బీ 2.0,

హెచ్‌టీసీ 8ఎస్: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-పై ఇంకా మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ:

హెచ్‌టీసీ 8ఎక్స్: 1800ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ,

హెచ్‌టీసీ 8ఎస్: 1700ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ.

దేశీయ మార్కెట్లో వచ్చే వారం విడుదల కాబోతున్న హెచ్‌టీసీ విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో విడుదల కానున్న నోకియా లూమియా 920 ఫోన్‌కు తీవ్రమైన పోటినిచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

లూమియా 920 ఫీచర్లు:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot