ఏదైనా సాధించేందుకు సిద్దం.. హెచ్‌టిసి

Posted By: Staff

ఏదైనా సాధించేందుకు సిద్దం.. హెచ్‌టిసి

 

హెచ్‌టిసి మార్కెట్లోకి మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసి, ఎక్కువ మార్కెట్ షేర్‌ని సొంతం చేసుకొవాలని ఆరాట పడుతుంది. అందుకే కాబోలు కొత్త మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. 2.5 GHz quad core CPUని సపోర్ట్ చేస్తూ 'హెచ్‌టిసి జీటా' అనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ ప్రాసెసర్‌ని బట్టి చూస్తుంటే హెచ్‌టిసి జీటా స్మార్ట్ ఫోన్ హై ఎండ్ ఫెర్పామెన్స్‌ని ప్రదర్శించే మొబైల్స్ విభాగంలోకి చేరేటట్లు ఉంది.

హెచ్‌టిసి జీటా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్‌లలో లేటెస్ట్ వర్సన్ అయిన ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన హెచ్‌టిసి ఎడ్జి స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, హెచ్‌టిసి జీటా మొబైల్ ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను డిస్ ప్లే సైజు 4.5 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ ముందు భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకు రావచ్చు.

ఇక మొబైల్ వెనుక భాగాన 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో కస్టమర్స్ అందమైన ఫోటలను తీయవచ్చు. వీడియో కాన్ఫరెన్స్, ఛాటింగ్‌లకు మొబైల్ చక్కగా అనుకూలిస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు కనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా అప్లికేషన్స్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసేటటువంటి అన్ని రకాల అప్లికేషన్స్‌ని కూడా ఈ మొబైల్ ద్వారా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. పాఠకుల కొసం హెచ్‌టిసి జీటా స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

'హెచ్‌టిసి జీటా' మొబైల్ ప్రత్యేకతలు:

* 2.5GHz quad-core APQ8064 Processor

* 1GB RAM

* Google Android Ice Cream Sandwich OS

* 4.5-inch Multi touchscreen Display

* Screen Resolution – 1280 x 720 pixels

* 8 Megapixel Rear Camera, 1.3 Megapixel Front Camera

* Dual-LED flash

* 720p video recording

* 1.3 megapixel Front Camera

* 32GB of Inbuilt Memory

* Audio/Video player

* Bluetooth 4.0

* W-Fi

* 3G

* USB

* 1,830mAh battery

* మొబైల్ చుట్టుకొలతలు: 109.8 x 60.9 x 9.8mm

* మొబైల్ బరువు: 146g

మొబైల్ ధరని ఇంకా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్ట లేదు. మరిన్ని వివరాలు అతి త్వరలో 'తెలుగు జిగ్‌బాట్' లో.........

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot