ఫేస్‌బుక్ ఫోన్ 2013లో?

Posted By: Prashanth

ఫేస్‌బుక్ ఫోన్ 2013లో?

 

బిలియన్ యూజర్లకు చేరువవుతున్న ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్, స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీతో జతకట్టి ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ విడుదల పట్ల మార్కెట్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. తాజాగా బహిర్గతమైన నివేదికలు ఫేస్‌బుక్ స్మార్ట్ ఫోన్ విడుదల 2013లో ఉంటుందని పేర్కొన్నాయి. మునుపటి పుకార్ల ప్రకారం ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్ 2012 సెప్టంబర్‌లో విడుదల కావల్సి ఉంది.

ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్ విడుదల పట్ల ఉత్కంఠతో ఉన్న పలువురు గ్యాడ్జెట్ ప్రియులు తాజా ప్రకటనతో నిరుత్సాహానికి గురయ్యారు . జాప్యానికి గల కారణాలు తెలియరాలేదు. ఫేస్‌బుక్ ప్రధాన ఆకర్షణగా గతంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు హెచ్‌టీసీ చాచా, హెచ్‌టీసీ సల్సాలు మార్కెట్లో అంతంగా ఆకట్టుకోలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న హెచ్‌టీసీ వర్గాలు ఫేస్‌బుక్ ఫోన్‌ను ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. చివరిగా ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఖచ్చితమైన సమచారం లేదు. కొన్ని రిపోర్టులు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అని పేర్కొంటుంటే, మరికొన్ని రిపోర్టులు విండోస్ ఫోన్ 8గా భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot