TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హెచ్‌టిసి కొత్త హ్యాండ్‌సెట్ 'టచ్ ఫ్రో 2'
హెచ్‌టిసి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ భాగస్వామ్యంతో ప్రత్యేకించి బిజినెస్ జనాభా కోసం క్లాసీ లుక్, కూల్ అప్లికేషన్స్, సూపర్ ఫాస్టు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పని చేసేలా కొత్త మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరు 'హెచ్‌టిసి టచ్ ఫ్రో 2'. మొబైల్ స్క్రీన్ సైజు 3.6 ఇంచ్‌లు. హెచ్‌టిసి టచ్ ఫ్రో 2 మొబైల్ బరువు 178.5 గ్రాములు. పుల్ క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉండి, టచ్ ఫ్లో 3డి ఫింగర్ స్వైప్ నావిగేషన్‌ని సపొర్ట్ చేస్తుంది. మొబైల్‌లో ఇంటర్నల్‌గా 288 MB RAMని నిక్షిప్తం చేయడం జరిగింది.
మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు.
మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 528 MHz ARM 11 ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. హెచ్‌టిసి టచ్ ఫ్రో 2 మొబైల్‌తో పాటు టివి అవుట్ పుట్, MIDP 2.0 జావా ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేడ్ అయి ఉంటుంది. దీని ద్వారా కొత్త కొత్త గేమ్స్‌ని ఇనిస్టాల్ చేసుకొవచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 20,000 నుండి 30,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణుల అంచనా...
హెచ్‌టిసి టచ్ ఫ్రో 2 మొబైల్ ప్రత్యేకతలు:
బరువు: 6.61 oz (187 g)
చుట్టుకొలతలు: 4.59" x 2.36" x 0.68" (117 x 60 x 17.3 mm)
బ్యాటరీ:1500 mAh LiIon
టాక్ టైమ్: 6.5 hours max. (390 minutes)
బ్యాటరీ స్టాండ్ బై: 750 hours max. (31.3 days)
డిస్ ప్లే టైపు: LCD (Color TFT/TFD)
డిస్ ప్లే రిజల్యూషన్: 480 x 800 pixels
ఆపరేటింగ్ సిస్టమ్:Windows Mobile Professional (Pocket PC), version 6.1 or 6.5
ప్రాసెసర్:528 MHz Qualcomm MSM7200A
మెమరీ: 288 MB internal storage, available to user