ప్లాన్ రెఢీ.. ప్రజలు ఏలా స్పందిస్తారో..?

Posted By: Super

ప్లాన్ రెఢీ.. ప్రజలు ఏలా స్పందిస్తారో..?

 

చైనా టెలికాం జెయింట్  హువావీ(Huawei) 4జీ సేవలను ఈ ఏడాది మధ్య నాటికి  భారత్‌కు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదే జరిగితే మార్కెట్లో లభ్యమవుతున్న  హువావీ   మొబైల్స్ అదే విధంగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల శాతం గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ టెలికాం సెక్టార్లో  క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న రిలయన్స్, టాటా కమ్యూనికేషన్‌లకు ఈ  తాజా పరిణామంతో హువావీ ప్రధాన పోటీదారు కానుంది. ఈ చర్యతో తాము ఇండియాలో 40శాతం వ్ళద్ధిని సాధించాలనుకుంటున్నామని సంస్థ  ఉపాధ్యక్షుడు  వెల్లడించారు. తాము ప్రవేశపెట్టబోతున్న 4జీ  సేవలకు సంబంధించి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అంశాలు పూర్తిగా  భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయని  ఆయన తెలిపారు. 4జీ సౌలభ్యతతో  వినియోగదారులు మరింత వేగవంతమైన నెట్‌వర్క్‌ను అందిపుచ్చుకోవచ్చు.  ఏదైమైనప్పటికి కొత్త నెట్‌వర్క్‌ను ప్రజలు ఏలా ఆదిరిస్తారో వేచి చూడాలి మరి!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot