ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది, పోటీ పడుతున్న 2 కంపెనీలివే !

చైనా మొబైల్ దిగ్గజం హువావే అతి త్వరలో సంచలనం సృష్టించబోతోంది. ఈ కంపెనీ నుంచి మడతబెట్టే (ఫోల్డబుల్‌) స్మార్ట్‌‌ఫోన్‌ రాబోతోంది.

|

చైనా మొబైల్ దిగ్గజం హువావే అతి త్వరలో సంచలనం సృష్టించబోతోంది. ఈ కంపెనీ నుంచి మడతబెట్టే (ఫోల్డబుల్‌) స్మార్ట్‌‌ఫోన్‌ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ డిప్యూటీ ఛైర్మన్‌ కెన్‌ హూ ధ్రువీకరించారు. తమ నుంచి వచ్చే తొలి మడతబట్టే స్మార్ట్‌ఫోన్‌లో 5జీ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫోన్‌ 2019 ఏడాది మధ్యలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

చైనా కంపెనీలకు షాక్, 5జీ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసిన ఆస్ట్రేలియాచైనా కంపెనీలకు షాక్, 5జీ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసిన ఆస్ట్రేలియా

ఇంకా కంప్యూటర్లే ఎందుకు వాడాలి?

ఇంకా కంప్యూటర్లే ఎందుకు వాడాలి?

గతవారం బెర్లిన్‌లో జరిగిన టెక్నాలజీ ట్రేడ్‌ షోలో హువాయి సంస్థ సీఈవో రిచర్డ్‌ యూ మాట్లాడుతూ.. ఇంకా కంప్యూటర్లే ఎందుకు వాడాలి? చిన్నగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేను మేం పూర్తిగా మార్చేస్తాం. పెద్ద తెరను రూపొందించి దాన్ని సౌకర్యవంతంగా మడతబెట్టుకునేలా తయారు చేస్తామని అన్నారు.

దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్‌

దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్‌

మడతబెట్టే స్మార్ట్‌‌ఫోన్లను అభివృద్ధి చేయడంలో దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్‌ మొదటి నుంచీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ సంస్థ 2018 ఆఖర్లో గానీ 2019 మొదట్లోగానీ ఈ తరహా ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

శాంసంగ్‌ మొబైల్స్‌ విభాగం చీఫ్‌ డీజే కోహ్‌

శాంసంగ్‌ మొబైల్స్‌ విభాగం చీఫ్‌ డీజే కోహ్‌

శాంసంగ్‌ మొబైల్స్‌ విభాగం చీఫ్‌ డీజే కోహ్‌ ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. నవంబర్‌ 7న శాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగే శాంసంగ్‌ వార్షిక అభివృద్ధి సదస్సులో సంస్థ నుంచి వచ్చే తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఫోన్ల అభివృద్ధి దాదాపు చివరి దశకు చేరిందని తెలిపారు.

శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో..

శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో..

విజయవంతమైన శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌10 స్మార్ట్‌ఫోన్‌ను 2019 ప్రారంభంలో విడుదల కానుందనే అప్పుడే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇండియాలో 5జీ మీద వస్తున్నరూమర్లు ఇవే !

ఇండియాలో 5జీ మీద వస్తున్నరూమర్లు ఇవే !

దేశంలో ఇప్పటికే 4జీ సేవలు పూర్తి స్థాయిలో ఆరంభం కాని నేపథ్యంలో అప్పుడే 5జీ మీద టెస్టింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కాగా దీనిపై పలు అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..

5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..

5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..

5జీ గురించి తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే !

5జీ గురించి తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే !

5జీ గురించి తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే !5జీ గురించి తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే !

Best Mobiles in India

English summary
Huawei's first foldable phone will also be its first 5G smartphone more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X