నాలుగు పవర్ పుల్ కెమెరాలతో Nova 2S స్మార్ట్‌ఫోన్

Written By:

మొబైల్ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ నోవా 2ఎస్‌ను తాజాగా చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.26,350గా నిర్ణయించింది. కాగా ఈ ఫోన్ లో మొత్తం నాలుగు కెమెరాలను అమర్చారు. కాగా ఈ ఫోన్ అతి త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

క్వాల్‌కామ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, స్పెషల్‌పై ఓ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావే నోవా 2ఎస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నాలుగు కెమెరాలు

వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను అమర్చారు. వీటితో క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ముందు భాగంలోనూ 20, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న మరో రెండు కెమెరాలను ఇచ్చారు. ఇవి సెల్ఫీలను ఫర్‌ఫెక్ట్‌గా తీసుకునేందుకు పనికొస్తాయి.

ఆండ్రాయిడ్ ఓరియో

ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్లో హువాయి EMUI 8.0 కూడా ఉంది. ఫోన్ ముందు భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఏర్పాటు చేశారు.

భారీ డిస్‌ప్లే

ఈ స్మార్ట్‌ఫోన్లో మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే భారీ డిస్‌ప్లే. 6 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లే వినియోగదారులను ఇట్టే కట్టి పడేస్తుందని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Nova 2s With 6-Inch Bezel-Less Display, 6GB RAM Launched: Price, Specifications
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot