ఈ ఫోన్ మీకు సూట్ అవుతుందా..?

స్మార్ట్ ఫోన్‌ల ఉత్పత్తిదారు హువావీ గతంలో విడుదల చేసిన ‘హువావీ ఎసెండ్’ మార్కెట్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే దూకుడుతో ‘హువావీ ఎసెండ్ II’ మార్కెట్లోకి రాబోతుంది. సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌ను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 116 గ్రాములు.
గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ‘హువావీ ఎసెండ్ II’ రన్ అవుతుంది. 3.5 అంగుళాల స్ర్కీన్, టచ్ స్వభావం కలిగి ఉంటుంది. శక్తివంతమైన క్వాల్కమ్ S1 MSM7627 ప్రాసెసర్‌ను మొబైల్‌లో లోడ్ చేశారు. వేగవంతమైన 3జీ నెట్‌వర్క్‌ను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. డివైజ్ ఇంటర్నల్ మెమెరీ 160 ఎంబీ, మైక్రోఎస్డీ కార్డ్ సౌకర్యంతో జీబిని 32కు పెంచుకోవచ్చు. అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ వీడియోలను అదే విధంగా ఫోటోలను పదిలపరుచుకునేందుకు దోహదపడుదుంది.
ఫోన్ ఇంటర్నెట్ వేగాన్ని పెంచేందుకు పొందుపరిచిన జీపీఎస్, 802.11 b/g/n వై-ఫై వ్యవస్థలు దోహదపడతాయి. బ్లూటూత్ v2.1, మైక్రో యూఎస్బీ 2.0 పోర్టులు డివైజ్ కనెక్టువిటీ వేగాన్ని పెంచుతాయి. దోహదం చేసిన 1400 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ 3.7 గంటలు టాక్ టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ధర రూ.20,000లోపు ఉండొచ్చని అంచనా.
‘హువావీ ఎసెండ్ II’లో నిరుత్సాహా పరిచే అంశాలు:
* పరిమితమైన ఇంటర్నల్ మెమరీ,
* కెమెరాకు ప్లాష్ లేదు,
* సెకండరీ కెమెరా కొరత,
* తక్కువ బ్యాటరీ సామర్ధ్యం.


Click it and Unblock the Notifications








