ముద్దు ముద్దుగా.. త్వరలో!!

Posted By: Prashanth

ముద్దు ముద్దుగా.. త్వరలో!!

 

మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ కంపెనీ హువావీ తన సరికొత్త స్మార్ట్‌పోన్‌కు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే ఈ మధ్య స్థాయి ఫోన్ ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. హువావీ ఆసెండ్ 300గా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను క్లుప్తంగా తెలుసుకుందాం...

* 4 అంగుళాల టీఎఫ్టీ మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* ప్రాక్సిమిటీ సెన్సార్,

* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,

* డిజిటల్ జూమ్,

* వీడియో రికార్డింగ్, ఎల్ ఈడి ఫ్లాష్,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, (యూట్యూమ్, పికాసా ఆన్ లైన్ సపోర్ట్),

* 2జీ ( జిఎస్ఎమ్), యూఎమ్‌టిఎస్ నెట్‌వర్క్ సపోర్ట్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్ సపోర్ట్,

డ్యూయల్ టోన్ కలర్ ఫినిష్‌తో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌ స్లిమ్ ఆక్ళతిని పోలి తక్కువ బరువు కలిగి ఉంటుంది. ముందు భాగంలో మూడు టచ్ సెన్సిటివ్ బటన్‌లను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. 4 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే ఉత్తమ క్వాలిటీ రిసల్యూషన్‌తో విజువల్స్‌ను విడుదల చేస్తుంది. వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌ను ఈ డివైజ్ ద్వారా పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot