ఇండియాలోకి తొలి 4జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్.. ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో!

Posted By: Prashanth

ఇండియాలోకి తొలి 4జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్.. ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో!

 

భారత్ లో 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే తొలి స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ సంస్థ హువావీ ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. హువావీ ‘ఎసెండ్ పీ1 ఎల్ టీఈ’గా రూపుదిద్దుకున్న ఈ ఫోన్ ఎయిర్‌టెల్ సరికొత్త ఎల్ టీఈ 4జీ నెట్‌వర్క్ పై కమ్యూనికేషన్ ఇంకా డాటా సేవలను అందిస్తుంది.

ఫీచర్లు:

4.3 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే (960×540పిక్సల్స్),

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్ 4 ప్రాసెసర్ (డ్యూయల్ కోర్), క్లాక్ స్పీడ్ 1.5గిగాహెడ్జ్,

1జీబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర ఇతర డేటా ప్లాన్స్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot