ఫైనల్ మ్యాటరేంటంటే... (అది మిస్సయ్యింది)?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావీ (Huawei) తాజాగా రూపొందించిన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘హువావీ ఎసెండ్ వై200’ ఆపరేటింగ్ సిస్టం విషయంలో నిరుత్సాహానికి గురి చేసినప్పటికి ఇతర స్పెసిఫికేషన్‌ల పరంగా ఆకట్టుకునే స్థాయిని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరటేంగ్ సిస్టంకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్న నేపధ్యంలో హువావీ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ వర్షన్‌ను ఎంచుకోవటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఫోన్ ఇతర ఫీచర్లు:
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320×480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 800మెగాహెట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్, 256ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యాక్సిలరోమీటర్, ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వై-పై, జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ.
(గమనిక: ఈ ఫోన్ విడుదల తేదీ, ధర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది)
భారత్‌లో హువావీ 4జీ ఫోన్‌లు!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల నిర్మాణ సంస్థ హువావీ (Huawei) భారత్‌లో ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఆధారిత పరికరాలను ప్రవేశపెట్టనుంది. ప్రణాళికలో భాగంగా డిసెంబర్ నాటికి ఎల్‌టీఈ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీని అందుబాటులోకి తెచ్చేందుకు బ్రాండ్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి దేశంలో పూర్తిస్థాయి 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. కోల్‌కతా, బెంగుళూరు వంటి పట్టణాల్లో ‘టీడీ ఎల్‌టీఈ’(TD LTE) నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ నెట్‌వర్క్ పూణే, ఢిల్లీ, ముంబయ్, చండీగఢ్ వంటి ప్రాంతాలకు విస్తరించనుంది. గ్యాడ్జెట్‌లను విడుదల చేసే అంశాన్ని హువావీ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.
హువావీ ప్రవేశపెట్టబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు:
ఎసెండ్ డి ఎల్ టీఈ (ధర తెలియాల్సి ఉంది),
ఎసెండ్ పీ1 ఎల్ టీఈ (ధర తెలియాల్సి ఉంది).


Click it and Unblock the Notifications








