ఈ మొబైల్‌తో ఏమైనా చేయవచ్చు..

Posted By: Staff

ఈ మొబైల్‌తో ఏమైనా చేయవచ్చు..

స్తుతం మొబైల్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న పేరు క్లౌడ్ కంప్యూటింగ్. ఐటి కంపెనీలు, హార్డ్ వేర్ తయారీదారులు క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ ఫామ్ మీద దృష్టిని కేంద్రీకరించి ఎప్పటి కప్పుడు కొత్త మొబైల్ మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటని అనుకుంటున్నారా.. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆన్ లైన్‌లో డేటాని డిస్ట్రిబ్యూటెడ్ క్లయింట్ సర్వర్ మోడల్ ద్వారా సమానంగా షేర్ చేయడం జరుగుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ మొబైల్ ఉంటే యూజర్ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఎటువంటి ఫైల్ ఫార్మెట్లను అయినా క్లౌడ్ ఎకౌంట్ ద్వారా అప్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే అతను వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

దీని కోసం యూజర్‌కి కావాల్సిందల్లా కంప్యూటర్ లేక స్మార్ట్ ఫోన్. ఈ రెండింటి ద్వారా అతను డిస్ట్రిబ్యూటెడ్ నెట్ వర్క్ టోపాలజీలో తన కార్యకలాపాలను చేసుకోవచ్చు. ఈ అధునాతన టెక్నాలజీతో హువాయ్ కంపెనీ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి క్లౌడ్ కంప్యూటింగ్ మొబైల్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మొబైల్ పేరు హువాయ్ విజన్. హువాయ్ విజన్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్‌తో పాటు ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అంతేకాకుండా 3డి యూజర్ ఇంటర్‌ఫేస్‌ని కలిగి ఉండి యానిమేషన్ డిస్ ప్లే బ్యాక్‌ దీని సోంతం.

హువాయ్ విజన్ పవర్ పుల్ 1 GHz Qualcomm Snapdragon ప్రాసెసర్‌తో పాటు మల్టీ టాస్కింగ్ పనులు వేగవంతంగా చేయడం, హై ఫెర్పామెన్స్‌ని డెలివరీ చేస్తుంది. హువాయ్ విజన్ మొబైల్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం అతి పెద్ద టచ్ స్క్రీన్‌తో పాటు, చక్కని ఇమేజీలను, వీడియోలను తీసేందుకు అనువుగా 5 మెగా ఫిక్సల్ కెమెరాని ఇందులో పోందుపరచడం జరిగింది. హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

అంతేకాకుండా కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయినటువంటి బ్లాటూత్, వై-పైలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకే ఒక్క సింగిల్ స్వైప్ ద్వారా 3డి హోమ్ స్క్రీన్ నావిగేషన్ యూజర్స్‌కు చక్కని ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది.

Huawei Vision specs are:

Cloud computing capability
1 GHz processor
Android Gingerbread OS
5 Mega Pixel camera with 720p Video recording
Wi-Fi
3D user interface

స్మార్ట్ పోన్ సెగ్మెంట్లో త్వరలో విడుదల కానున్న హువాయ్ విజన్ విడుదలల తేదిని, ధరను మార్కెట్లో ఇంకా ప్రవేశపెట్టలేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో మీకోసం అందచేస్తాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot