Home
Mobile

ఫోల్డబుల్ ఫోన్స్ రాకతో ల్యాప్‌టాప్‌లు కనుమరుగు కాబోతున్నాయా..?

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే (Huawei), ఓ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్ పై వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే.

By Bommu Sivanjaneyulu

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే (Huawei), ఓ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్ పై వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2018 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హువావే సీఈఓ రిచర్డ్ యు (Richard Yu), ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు.

బెండబుల్ ఫోన్‌ల రాకతో పరిస్థితి తారుమారు..

బెండబుల్ ఫోన్‌ల రాకతో పరిస్థితి తారుమారు..

తాము అభివృద్థి చేస్తోన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చినట్లయితే ల్యాప్‌టాప్‌లు పూర్తిగా కనుమరుగు అయిపోతాయని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు చిన్న చిన్న స్ర్కీన్‌లను కలిగి ఉండటం కారణంగా ల్యాప్‌టాప్‌ల హవా ఇంకా కొనసాగుతోందని, బెండబుల్ ఫోన్‌ల రాకతో ఆ పరిస్థితి మారిపోబోతోందని ఆయన తెలిపారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ స్ర్కీన్‌ను ప్రొవైడ్ చేసే వీలుండటంతో ఇవి ల్యాప్‌టాప్‌లతో సమానంగా పనచేయగలుగుతాయట.

 

 

వచ్చే ఏడాదిలోపు కమర్షియల్ మార్కెట్లోకి..

వచ్చే ఏడాదిలోపు కమర్షియల్ మార్కెట్లోకి..

ల్యాప్‌టాప్‌లతో పోటీపడగలిగే బెండబల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలోపు కమర్షియల్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు యు తెలిపారు. ఇదే సమయంలో సామ్‌సంగ్ కూడా తన మొదటి కన్స్యూమర్ గ్రేడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్, హువావే ఫోల్డబుల్ టైప్ ఫోన్‌ల మధ్య భీకర పోరు నెలకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడే అంచనా వేయలేమన్న సామ్‌సంగ్..

ఇప్పుడే అంచనా వేయలేమన్న సామ్‌సంగ్..

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ మొబైల్ చీఫ్ డీజీ కోహ్ స్పందిస్తూ, తాము ఫ్లెక్సిబుక్స్ స్ర్కీన్స్ అలానే దాని సంబంధిత టెక్నాలజీలను వినియోగించుకుని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నామని, అయితే ఇవి ల్యాప్‌టాప్‌లకు ప్రత్యామ్నాయంగా నిలబడతాయని తాము అనుకోవటం లేదని అన్నారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండస్ట్రీ పై ఏ విధమైన ప్రభావాన్ని చూపుబోతున్నాయి అనే దానే పై ఇంకా స్పష్టమైన అంచనాకు తాము రాలేదని ఆయన తెలిపారు.

షియోమి  నుంచి కూడా ఓ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌..?

షియోమి నుంచి కూడా ఓ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌..?

హువావే బాటలోనే షియోమి కూడా ఓ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు రూమర్స్ మిల్స్ కోడై కూస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి షియోమి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ న్యూస్ అందుబాటులో లేదు. ఇదే సమయంలో ఒప్పో కూడా ఓ బెండబుల్ ఫోన్ అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei claims its foldable phone will make laptops a thing of the past.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X