డిస్కవరితో భాగస్వామ్యం ఆనందంగా ఉంది...

Posted By: Super

డిస్కవరితో భాగస్వామ్యం ఆనందంగా ఉంది...

అందమైన మొబైల్‌‌తో పాటు ఫీచర్స్ ఆకర్షణీయంగా ఉంటే యూజర్స్ మనసు ఇట్టే దొచేస్తున్నాయి మొబైల్ ఫోన్స్. యూజర్స్ కొసం ఏ మొబైల్ తయారీదారు ఐతే ఇలాంటి మొబైల్ ఫోన్స్‌ని తయారు చేస్తారో వారు తప్పకుండా మార్కెట్లో సక్సెస్ అవుతారు. ప్రపంచంలో పెద్ద మీడియా ఆర్గనైజేషన్‌ని కలిగి ఉన్న సంస్ద 'డిస్కవరి కమ్యూనికేషన్స్' మొబైల్ ఫోన్ తయారీదారైన బిహిమోత్ ఆర్గనైజేషన్‌తో కలసి మార్కెట్లోకి హువాయ్ హ్యాండ్ సెట్‌ని విడుదల చేయనున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంతో మార్కెట్లోకి విడుదల చేయనున్నఆ మొబైల్ ఫోన్‌ పేరు 'హువాయ్ డిస్కవరి ఎక్సిపిడిషన్ ఫోన్'.

ఈ రెండు కంపెనీలు హువాయ్ మొబైల్ కంపెనీతో కలవడానికి గల కారణం హువాయ్ ఇప్పటికే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలలో సక్సెస్‌ని సాధించడమేనని అన్నారు. 'హువాయ్ డిస్కవరి ఎక్సిపిడిషన్ ఫోన్' ని వేరే ఇతర కంపెనీ ఫోన్లతో ఏ మాత్రం పోల్చలేమని, ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ యూజర్స్‌ని వెంటనే ఆకర్షిస్తాయని తెలిపారు. 'హువాయ్ డిస్కవరి ఎక్సిపిడిషన్ ఫోన్' హ్యాండ్ సెట్ ఆఫీసియల్ లైఫ్ స్టయిల్ బ్రాండ్‌గా అభివర్ణించడం జరిగింది.

ఈ మొబైల్‌కి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ మొబైల్‌లో వాటర్ ఫ్రూఫ్, డస్ట్ ఫ్రూఫ్, షాక్ ప్రూఫ్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌తో రూపొందించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఈ మొబైల్‌లో టార్చ్, కంపాస్, జి సెన్సార్‌లను కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. సోషల్ నెట్ వర్కింగ్ విషయానికి వస్తే ఫేస్‌బుక్, ట్విట్టర్, లాంటి వాటిని ఈజీగా కనెక్ట్ అవ్వవచ్చు. డిస్కవరి కమ్యూనికేషన్ వారు ప్రస్తావించిన దానిని బట్టి చూస్తుంటే ఎవరైతే విహారయాత్రలకు వెళతారో, వారియొక్క ఎక్స్ పీరయన్స్‌ని స్నేహితులతో సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్ ద్వారా పంచుకొవచ్చు.

హువాయ్‌తో మొట్టమొదటి సారి డిస్కవరి కమ్యూనికేషన్ కలసి రూపోందించినటువంటి ఈ మొబైల్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ కోసమే కాకుండా, ప్రతి ఒక్కరి లైఫ్ స్టయిల్ పనులను కూడా చక్కబెడతాయని అన్నారు. ఈ సందర్బంలో హువాయ్ డివైజెస్ ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ విక్టర్ జు డిస్కవరి ఛానల్ లో మాట్లాడుతూ రాబోయే కాలంలో డిస్కవరి కమ్యూనికేషన్‌తో కలసి మరిన్ని మంచి మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నామని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot