విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు!

Posted By: Staff

విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు!

 

ఉత్తమ క్వాలిటీ స్మార్ట్‌పోన్‌ల తయారీ బ్రాండ్ హువావీ కొత్త ఆవిష్కరణతో ముందుకు రాబోతుంది.  అత్యుత్తమ గ్యాడ్జెట్లను అందించిన ఈ బ్రాండ్ మరో సక్సెస్ పై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సంస్ధ నుంచి హువావీ జీ6609గా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఈ డివైజ్‌కు సంబంధించి కొన్ని స్సెసిఫికేషన్‌లు మాత్రమే రివీల్ కావటంతో అటు మార్కెట్లో  ఇటు అభిమానుల్లో  అంచనాలు జోరందుకున్నాయి.  ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ ఆప్షన్‌ను కలిగి ఉంది.

ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి  సంబంధించి  పొందుపరిచిన ఫీచర్లు ఫీల్ గుడ్ అనుభూతులను చేరువ చేస్తాయని అంచనా. నిక్షిప్తం చేసిన ఎఫ్ఎమ్ రేడియో, రికార్డింగ్ సౌలభ్యతలు వినియోగదారులకు రెట్టింపైన వినోదాన్ని చేరవచేస్తాయి. అమర్చిన  కెమెరా వ్యవస్ధతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో ప్లేయర్లు క్వాలిటీతో కూడిన వినోదాభరిత అనుభూతులను యూజర్‌కు చేరువచేస్తాయి.

హ్యాండ్‌సెట్ ప్రాసెసర్ అదేవిధంగా  ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యానికి సంబంధించి వివరాలు వెల్లడికావల్సి ఉంది. చక్కటి సమర్థత కలిగిన ప్రాసెసర్‌తో పాటు  ఉన్నతస్థాయి ఆపరేటింగ్ వ్యవస్థలను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధర ఇతర విడుదల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. సమంజసమైన ధరకే ఈ ఫోన్‌ను కైవసం చేసుకోవచ్చన్న భరోసాను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot