హువాయ్ టచ్ ఫోన్ 'జి7300'...

Posted By: Super

హువాయ్ టచ్ ఫోన్ 'జి7300'...

 

వైర్‌లెస్ ఇంటర్నెట్ మోడమ్ టెక్నాలజీ రారాజులా వెలుగొందుతున్న మొబైల్ సంస్ద 'హువాయ్'. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో రోజుకి కొన్ని పదుల సంఖ్యలో మొబైల్స్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఉన్న కాంపిటేషన్‌ని తట్టుకొని నిలబడాలంటే విడుదల చేసే ప్రతి మొబైల్ లోను కొన్ని ప్రత్యేకమై న ప్రత్యేకతలను ఇమడింపజేయాల్సి ఉంటుంది. హువాయ్ ఖచ్చితంగా ఇక్కడ అలాంటి పనే చేసింది.

హువాయ్ కొత్తగా మార్కెట్లోకి 'హువాయ్ జి7300' అనే బార్ మోడల్ ఫోన్‌ని విడుదల చేసింది. డిస్ ప్లే సైజు 3.5 ఇంచ్‌లను కలిగి ఉండి, టిఎఫ్‌టి HVGA టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకత. మొబైల్ బరువు 110 గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 106mmx60mmx115mm.

పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1300 mAh Li-Ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 3 గంటల 20నిమిషాలు, అదే స్టాండ్ బై టైమ్ 200 గంటలు. హువాయ్ జి7300 స్మార్ట్ ఫోన్ MTK 6236 ఛిప్ సెట్‌తో పాటు, 312 MHz ప్రాసెసర్‌ని కలిగి ఉంది. మార్కెట్లో లభించే MP3/WAV/AAC+ ఫార్మెట్లను సపొర్ట్ చేస్తుంది.

సోషల్ నెట్ వర్కింగ్ ఫీచర్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను కనెక్టు అయ్యేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా బటన్స్‌ని రూపొందించడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 40 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు. కనెక్టివిటీ ఫీచర్ అయిన బ్లూటూత్ v3.0ని హువాయ్ జి7300 సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో హువాయ్ జి7300 మొబైల్ ధరని ఇంకా అధికారకంగా ప్రకటించ లేదు.

'హువాయ్ జి7300' మొబైల్ ప్రత్యేకతలు:

డిస్ ప్లే:     3.5‘ HVGA TFT display

మెమరీ:     40MB Internal memory

కెమెరా:     3.2 MP camera

బ్యాటరీ:     1300mAh

ప్రాసెసర్:     MTK 6236@312MHz

కనెక్టివిటీ:     EDGE, 4 bands, Bluetooth 2.1

చుట్టుకొలతలు:     106mm Length, 60mm Width, 11.5mm

బరువు:     110g

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot