Home
Mobile

రూ. 32,999 ధరతో హానర్ 10, ఫీచర్లు, లాంచ్ ఆఫర్లు ఇవే !

చైనా మొబైల్ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 10'ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది.

By Hazarath Aiah

చైనా మొబైల్ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 10'ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఫాంటమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.32,999గా నిర్ణయించింది. కాగా ఈ ఫోన్‌లో 5.84 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. అలాగే ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. అందువల్ల డివైస్‌ను వేగంగా అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాగే తడి వేళ్లతోనూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పనిచేస్తుంది.

Honor 10

హానర్ 10 లాంచ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా కస్టమర్లకు అందజేస్తున్నారు. ఇతర స్మార్ట్‌ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.5వేల వరకు ఎక్స్‌ట్రా వాల్యూను ఇస్తున్నారు. అలాగే నోకాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై జియో రూ.1200 క్యాష్ బ్యాష్, 100 జీబీ అదనపు మొబైల్ డేటా, రూ.3300 విలువైన పార్ట్‌నర్ మర్చంట్స్ వోచర్లను ఉచితంగా అందిస్తున్నారు.

హువావే హానర్ 10 ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Huawei Honor 10 launched at Rs 32,999 on Flipkart: All you need to know More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X