హానర్ 6ఎక్స్ vs కూల్‌ప్యాడ్ కూల్ 1

రెండు సంవత్సరాల క్రితం వరకు స్మార్ట్‌ఫోన్‌లలో డ్యుయల్ కెమెరా సెటప్ అనేది ఒక ఆలోచన మాత్రమే. కాని, ఇప్పుడది వాస్తవం రూపం. స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌ల రాకకు దోహదపడ్డాయి. యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఈ ఏడాది లాంచ్ చేయబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో డ్యుయల్ కెమరా సెటప్‌ను ఏర్పాటు చేయబోతున్నాయి. డ్యుయల్ కెమెరా సెటప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసింది చైనా కంపెనీలే.

హానర్ 6ఎక్స్ vs కూల్‌ప్యాడ్ కూల్ 1

భారత్‌లో తొలిసారిగా హువావే కంపెనీ హానర్ 8 పేరుతో డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ.30,000గా ఉంది. తాజగా, బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ హువావే తాజాగా Honor 6X పేరుతో ఓ డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. అయితే, ఇదే సెగ్మెంట్‌లో చైనాకు చెందిన మరో కంపెనీ కూల్‌ప్యాడ్ Cool 1 పేరుతో డ్యయల్ కెమెరా సెటప్ ఫోన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ కూడా ఇంచు మించుగా ఇదే ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ ఇంకా డిస్‌ప్లే

డిజైన్ ఇంకా డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ అలానే కూల్‌ప్యాడ్ కూల్ 1 ఫోన్‌లు మెటల్ యునిబాడీ డిజైన్ తో వస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి వెనుకవైపు భాగాల్లో క్యాప్సుల్ షేపులో డ్యుయల్ కమెరా మాడ్యుల్స్‌ను మనం చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్‌లను కూడా వెనుక భాగాల్లో చూడొచ్చు. ఇన్-హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ చేతిలో మరింత సౌకర్యవంతంగా ఇమిడిపోతోంది.

 

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

ఇక డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. కూల్‌ప్యాడ్ కూల్ 1 ఫోన్‌తో పోలిస్తే ఒకడుగు ముందంజలో ఉన్న హానర్ 6ఎక్స్ ఫోన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ప్యానల్‌తో వస్తోంది. ఇదే సమయంలో కూల్‌ప్యాడ్ కూల్ 1 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది.

 

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కాంపిటీటివ్ హార్డ్‌వేర్ లైనప్‌తో బరిలోకి దిగాయి. Qualcomm Snapdragon 652 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను కూల్ 1 ఫోన్ కలిగి ఉండగా, హానర్ 6ఎక్స్ ఫోన్ తన సొంత Kirin 655 చిప్‌సెట్‌తో పాటు 3జీబి + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ స్పేస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

 

ప్రాసెసర్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన ప్రాసెసర్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే హానర్ 6ఎక్స్ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన Kirin 655 chipset బెస్ట్ అనిపిస్తుంది. 16nm నోడ్ పై బిల్ట్ చేయబడిన Kirin 655 సాక్, కూల్ 1 ఫోన్‌లోని స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్‌తో పోలిస్తే అదనపు సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇతర ఫోన్‌ల మాదిరిగా హానర్ 6ఎక్స్ ఫోన్‌లలో హీటింగ్ సమస్యలు ఉండవు. రోజువారి స్మార్ట్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంతో హానర్ 6ఎక్స్ ఫోన్‌లోని కైరిన్ 650 చిప్‌సెట్ పూర్తిస్ధాయిలో విజయవంతమవుతుంది.

కనెక్టువిటీ ఫీచర్స్..

కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 4జీ వోల్ట్ సపోర్ట్‌తో వస్తున్నాయి. వై-ఫై రిపీటర్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను హానర్ 6ఎక్స్ ఫోన్‌లో అదనంగా మనం చూడొచ్చు. ఈ ఫీచర్, ఫోన్‌ను Wi-Fi modemలా మార్చివేయగలదు.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ ఫోన్ ఆండ్రాయిడ్ Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన EMUI 4.1 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ లభించనుంది. ఇదే సమయంలో కూల్‌ప్యాడ్ కూల్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన లీఇకో కస్టమ్ EUI 5.6 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు నౌగట్ అప్‌డేట్ ఎప్పుడు లభిస్తుందనేది తెలియాల్సి ఉంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. హానర్ 6ఎక్స్ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా DSLR తరహాలో రియల్ టైమ్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో కూల్‌ప్యాడ్ కూల్ 1 ఫోన్ 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన కెమెరాలు శక్తివంతంగా ఉన్నప్పటికి ఇన్‌డోర్ షాట్స్, అవుట్‌డోర్ షాట్స్, క్లోజప్ షాట్స్ ఇంకా లో-లైట్ షాట్స్ విషయంలో హానర్ 6ఎక్స్ కెమెరాలో ముందంజలో ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి హానర్ 6ఎక్స్ ఫోన్ 3,340mAh బ్యాటరీతో వస్తోండగా, కూల్‌ప్యాడ్ కూల్ 1 ఫోన్ 4,060mAh బ్యాటరీతో వస్తోంది. ఈ విభాగంలో కూల్‌ప్యాడ్ కూల్ 1 ఫోన్ దే పై చేయిగా చెప్పుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Honor 6X vs CoolPad Cool 1: Who wins the battle of dual-camera phones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot