4జిబి ర్యామ్‌తో హానర్ 9 లైట్ వచ్చేస్తోంది !
హువాయి తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హువాయి వి10ను గత వారం లాంచ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
హువాయి తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హువాయి వి10ను గత వారం లాంచ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కంపెనీ అదే ఊపులో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. డిసెంబర్ 21న చైనాలో అట్టహాసంగా జరిగే వేడుకలో ఈ హానర్ 9 లైట్ ని హువాయి కంపెనీ లాంచ్ చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
English summary
Huawei Honor 9 Lite smartphone to launch on December 21 More News at Gizbot Telugu
Story first
published: Monday, December 18, 2017, 16:26 [IST]


Click it and Unblock the Notifications








