ఇండియాలో త్వరలో... ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్!!

Posted By: Prashanth

ఇండియాలో త్వరలో... ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్!!

 

టెక్ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చంతా కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ v4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం గురించే. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వేగవంతమైన కంప్యూటింగ్ కు సహకరించే విధంగా ఈ ఆపరేటింగ్ వ్యవస్థను డిజైన్ చేశారు. ప్రముఖ మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారు హువాయ్ (Huawei) ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో డిజైన్ చేయబడిన స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘హువాయ్ హానర్’( Huawei Honor) వర్షన్‌లో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ స్పెసిఫికేషన్లు:

* ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ ఫీచర్,

* A2DP బ్లూటూత్ v2.1,

* మైక్రో యూఎస్బీ v2.0,

* FWVGA సామర్ధ్యం గల 4 అంగుళాల టీఎఫ్టీ మల్టీ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 854 పిక్సల్స్,

* మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు,

* 3.5mm ఆడియో జాక్,

* 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసింగ్ వ్యవస్థ,

* 512 ఎంబీ ర్యామ్, 4జీబి రోమ్,

* గైరో ప్రాక్సిమిటీ సెన్సార్స్ మరియు యాక్సిలరోమీటర్,

* 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్గింగ్,

* గుగూల్ సెర్చ్, జీమెయిల్, గుగూల్ టాక్,

* కనెక్టువిటీ అంశాలు జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జి,

* 802.11 b/g/n వై-ఫై, హాట్ స్పాట్, డీఎల్ఎన్ఏ (DLNA),

* ఆడోబ్ ఫ్లాష్ ఇంటిగ్రేటెడ్ హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్,

* 1900 mAh లైపో ఇయాన్ బ్యాటరీ వ్యవస్థ.

విడుదలకు ముందే వినియోగదారుల్లో ఉత్సకత రేపుతున్న ‘హువాయ్ హానర్’ విడుదల తరువాత ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి మరి. ధర మరియు ఇతర స్సెసిఫికేషన్ల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting