క్లాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోని..

Posted By: Super

క్లాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోని..

ఇండియన్ ఎకానమీ ఎప్పుడైనా పెరగొచ్చు లేదా తగ్గోచ్చు. కానీ ఇండియన్ మొబైల్ మార్కెట్ మాత్రం అలా కాదు. గత కొన్ని రోజులుగా ఇండియన్ మొబైల్ మార్కెట్లో అబివృద్దే తాండవిస్తుంది. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియాలో ప్రతి రోజుకొక మొబైల్ విడుదలవుతుందనడంలో ఎటువంటి సందేహాం లేదు. చిన్న చిన్న మొబైల్స్ మోడల్స్ నుండి కూడా హై ఎండ్ మోడల్స్ వరకు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా మార్కెట్లో మంచి సేల్స్‌ని నమోదు చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి వచ్చిన మొబైల్ తయారీ సంస్ద హువాయ్. టెలికమ్ తయారీ రంగంలో హువాయ్ కంపెనీకి మంచి ఇమేజి ఉంది. ఇండియాలో మొట్టమొదటి మొబైల్‌ని విడుదల చేసినప్పటి నుండి హువాయ్ కంపెనీ మంచి సేల్స్‌ని రాబట్టుకుంది. రాబోయే కాలంలో హువాయ్ కంపెనీ విడుదల చేయనున్న రెండు స్మార్ట్ ఫోన్స్ గురించిన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రెండు మొబైల్స్‌లలో ఒకటి హువాయ్ విజన్. రెండవది హువాయ్ ఇడియోస్ ఛాట్. రెండు మొబైల్స్ కూడా రెండు రకాల కేటగిరిలకు సంబంధించిన మొబైల్ పోన్స్ అయినప్పటికీ కొన్ని కొన్ని ఫీచర్స్ మాత్రం ఒకే విధంగా ఉండడం గమనార్హం.

హువాయ్ ఇడియోస్ ఛాట్ మొబైల్ టచ్ అండ్ టైప్ బార్ మొబైల్. యూజర్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించేందుకుగాను 2.6 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ దీని సోంతం. అదే హువాయ్ విజన్ విషయానికి వస్తే 3.7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు త్వరలో మార్కెట్లోకి రానున్న క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి సంబంధించిన మొబైల్ ఫోన్. యూజర్స్ యొక్క క్లౌడ్ ఎకౌంట్స్‌ని కంప్యూటింగ్ డివైజ్ ద్వారా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్న మొబైల్ హువాయ్ విజన్. హువాయ్ విజన్‌లో ఉన్న 3డి ఇంటర్ ఫేస్ వల్ల పేజీలు, మెనులను స్వైపింగ్ ద్వారా నావిగేట్ చేయవచ్చు.

ఇక హువాయ్ విజన్ ఇండియాలోని హై క్లాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అందుకా కారణం 5 మెగా ఫిక్సల్ కెమెరాతోపాటు ఎల్‌ఈడి ఫ్లాష్ దీని సోంతం. ఇక హువాయ్ ఇడియోస్ ఛాట్‌ మాత్రం కేవలం 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి, వీడియో రికార్డింగ్‌ని కూడా 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై తోపాటుగా, 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన జిపిఆర్‌ఎస్, ఎడ్జిలను కూడా సపోర్ట్ చేస్తాయి. మొబైల్స్ తోపాటు కొంత ఇంటర్నల్ మొమొరీ రాగా, మొమొరీని మైక్ర్ ఎస్‌డి స్లాట్ ద్వారా 32 జిబి వరకు ఎక్పాండ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ కూడా ఉంది.

హువాయ్ ఇడియోస్ ఛాట్‌తో హువాయ్ విజన్‌ని పోల్చితే ఫెర్పామెన్స్ చాలా ఫాస్టుగా ఉంటుంది. హువాయ్ విజన్ మొబైల్‌లో ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్ పనులను చాలా వేగవంతంగా పూర్తి చేస్తుంది. అదే హువాయ్ ఇడియోస్ ఛాట్‌లో మాత్రం ఈక్లైర్ ఆపరేటింగ్‌ రన్ అవుతుంది. ఇక హువాయ్ ఇడియోస్ ఛాట్ ఖరీదు విషయానికి వస్తే రూ 7449 మాత్రమే. అదే హువాయ్ విజన్ ధర మాత్రం ఇంకా మార్కెట్లో వెల్లిడించలేదు. హువాయ్ ఇడియోస్ ఛాట్‌తో పోల్చితే మాత్రం ధర ఎక్కువగా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot