రూ 4, 000లకే అదిరెను...

Posted By: Super

రూ 4, 000లకే అదిరెను...

చైనా మొబైల్ తయారీదారైన హువాయ్ ఇండియన్ మార్కెట్లోకి ఫెర్పామెన్స్ ఆధారిత ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. హువాయ్ ఆఫీసియల్స్ సమాచారం మేరకు హువాయ్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా ఇండియన్ మార్కెట్లో రూ 4,000 నుండి లభించనున్నాయి. ఇంత తక్కువ ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అని ప్రకటించడంతో అసలు జనాభా దీనిని నమ్మలేని పరిస్దితిలో ఉన్నారు. కానీ హువాయ్ మాత్రం ఇది నిజమని ఇంత తక్కువలో ఆండ్రాయిడ్ ఫోన్‌ విడుదల చేయడానికి గల కారణాలను కూడా వివరించింది.

యూజర్స్‌కు రూ 4,000లకే హువాయ్ అందిస్తున్న ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో 3జీ సర్వీస్‌ని అందించడం లేదు. హువాయ్ రూ 4,000లకే ఆండ్రాయిడ్ ఫోన్‌ మార్కెట్లో విడుదల చేయడానికి గల కారణం సాధారణంగా వేరే కంపనీలకు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడు మీకు అర్దం అయ్యే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్ పీరియన్స్‌ని పొందాలనుకునే వారికి ఈ మొబైల్ చక్కని ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుందని తెలిపారు.
3జీ లేకపోయినప్పటికీ ఇందులో వై-పై కనెక్టివిటీ, జిపిఎస్, బ్లూటూత్ ఫీచర్స్‌ని కలిగి ఉంది.

హువాయ్ విడుదల చేయనున్న ఈ హ్యాండ్ సెట్ పేరు హువాయ్ యు8110గా భావిస్తున్నారు. దీనియొక్క స్క్రీన్ సైజు 2.8 ఇంచ్‌గా ఉండి, ఆండ్రాయిడ్ 2.1 వర్సన్‌తో రన్ అవుతుంది. ఇండియాలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ వర్సన్ 2.2తో కూడా అప్ గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మొబైల్ మార్కెట్లో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో పోల్చితే మంచి ఫీచర్స్‌ని అందిస్తూ, ధర తక్కువగా కలిగిన ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ హువాయ్ యు8110.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot