ప్రపంచంలో మొట్టమొదటి Tri-Fold స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది! ధర,స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు
గత రాత్రి ఆపిల్ సంస్థ ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన కొద్ది గంటలకే, ఇప్పుడు ప్రపంచంలోని మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ హువావే యొక్క - Mate XT Ultimate Edition ను లాంచ్ చేయడం ఆపిల్ యొక్క ట్రెండ్ ను దొంగిలించినట్లైంది.
టాబ్లెట్- సైజు లో ఉండే 10.2-అంగుళాల ఫోల్డబుల్ 3K రిజల్యూషన్ ఫోల్డబుల్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. పూర్తిగా మడతపెట్టినప్పుడు 6.4-అంగుళాల స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించవచ్చు. పాక్షికంగా తెరిచినప్పుడు, ఇది 7.9-అంగుళాల ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా మారుతుంది మరియు పూర్తిగా తెరిచినప్పుడు, ఇది పెద్ద 10-అంగుళాల టాబ్లెట్‌గా మారుతుంది.

ఈ రెండు స్క్రీన్‌లు, ఫోల్డబుల్ ప్రైమరీ స్క్రీన్ మరియు కవర్ డిస్‌ప్లేతో కూడిన చాలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల లాగా కాకుండా, Huawei దాని ట్రై-ఫోల్డ్ టెక్నాలజీతో కేవలం ఒకే స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది. ఇది రెండు స్థాయిలలో మడచబడుతుంది .
ఈ ఫోన్ ధర 1,99,99 యువాన్ (సుమారు రూ. 2,35,000) ప్రారంభ ధరతో, ఇది ఖచ్చితంగా ఖరీదైన ఫోన్ గా ఉంటుంది. ఈరోజు నుండి ప్రీ-ఆర్డర్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 20 నుండి సేల్ చేయబడుతుంది మరియు ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనా లో మాత్రమే లాంచ్ చేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు వస్తుందనే విషయం ఇప్పటికి ఇంకా తెలియదు.
ఈ స్మార్ట్‌ఫోన్ 298 గ్రా బరువుతో, పూర్తిగా విప్పబడినప్పుడు, పరికరం కేవలం 3.6 మిమీ మందంగా ఉంటుంది, ఇది మార్కెట్‌లోని అత్యంత సన్నని పలుచని స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.
దీన్ని సాధించడానికి, Huawei అల్ట్రా-టఫ్ లామినేటెడ్ స్ట్రక్చర్ మరియు నాన్-న్యూటోనియన్ ఫ్లూయిడ్ వాడకంతో సహా కొన్ని అత్యాధునిక టెక్నాలజీలని పొందుపరిచింది. ఈ ఫోన్‌లో కంప్రెషన్‌ను నిరోధించే లోపలి మడత మరియు టెన్షన్‌ను నిరోధించే బయటి మడతతో రెండు కీలు ఉన్నాయి. ఈ కీలు దాని స్థానాన్ని పట్టుకుని ఒకే దిశలో సజావుగా కదులుతుందని నిర్ధారిస్తుంది.
Huawei మేట్ XT అల్టిమేట్ ఎడిషన్‌కు శక్తినిచ్చే చిప్ సెట్ గురించి Huawei ఏమి ప్రకటించలేదు. ఈ చిప్ సెట్ ఇన్-హౌస్ కిరిన్ 9000S ఆధారంగా ఉండే అవకాశం ఉంది. ఇది కంపెనీ యొక్క నాన్-ఫోల్డింగ్ ఫ్లాగ్‌షిప్ Mate 60 Pro+ కి శక్తినిస్తుంది మరియు ఈ ఫోన్ HarmonyOS 4.2 తో అందించబడుతుంది. ఈ ఫోన్ 16 GB RAM తో 256/512 GB స్టోరేజీ లేదా 1TB ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తుంది.
Huawei Mate XT లోని కెమెరా యూనిట్‌లో 50 MP ప్రధాన కెమెరా, 12 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 5.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 12 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. పంచ్-హోల్ కటౌట్‌లో ఉంచబడిన ముందు భాగంలో 8 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
రోజంతా బ్యాటరీని అందించడానికి, కేవలం 3.6 mm మందం సన్నగా ఉన్నప్పటికీ, ఫోన్ ఒక భారీ 5600mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటివరకు ఉపయోగించిన ప్రపంచంలోనే అత్యంత సన్నని బ్యాటరీగా భావించబడుతుంది. ఈ ఫోన్ 66W ఫాస్ట్ వైర్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా సమాచారం లేదు.


Click it and Unblock the Notifications








