మొబైలా లేక ఆట వస్తువా..!!

Posted By: Staff

మొబైలా లేక ఆట వస్తువా..!!

హువాయ్, సర్వీస్ ప్రోవైడర్ మెట్రో పిసిఎస్ అమెరికన్ మార్కెట్లోకి కొత్తగా హువాయ్ ఎమ్835 టొకిడొకి మొబైల్ ఎడిషన్‌ని విడుదల చేయనుంది. హువాయ్ ఎమ్835 స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఫీచర్స్ బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా మొబైల్ వెనుక భాగాన అద్బుతమైన గ్రాపిక్స్‌ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ గ్రాఫిక్స్‌ని జపనీస్ ఆర్ట్ ప్రకారం వైట్ బ్యాక్ గ్రౌండ్‌పై లైఫ్ స్టయిల్‌ బ్రాండ్‌ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ బొమ్ములు అన్ని కూడా చిన్నప్పడు మనం చూసిన పొకిమాన్ తరహాలో ఉంటాయి.

గతంలో హువాయ్ కంపెనీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌లతో పొల్చితే గనుక హువాయ్ ఎమ్835 మొబైల్‌లో ఉన్న కెమెరా లెన్స్, కీప్యాడ్, ఇయర్ పీస్ అందంగా తీర్చి దిద్దడం జరిగింది. ఐతే ఈ మొబైల్‌ని ఆడవారి అభిరుచులకు, మగవారి అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ మొబైల్‌కున్న మరో విశిష్టత ఏమిటంటే మొబైల్‌తో పాటు రెండు బ్యాటరీ కవర్స్ రానున్నాయి. రెండు కవర్స్ వెనుక భాగాన డిజైన్స్‌తో యూజర్స్‌కు అందివ్వడం జరుగుతుంది. ఒక కవర్ బొర్ కొట్టినప్పుడు వేర్ కవర్‌ని యూజర్ మార్పు చేసుకొవచ్చు.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే హువాయ్ ఎమ్835 యూజర్స్‌ని ఏ విషయంలో కూడా నిరాశ పరచవు. హువాయ్ ఎమ్835 మొబైల్ పోన్స్ ఫీచర్స్ క్లప్తంగా...

హువాయ్ ఎమ్835 మొబైల్ ఫీచర్స్:

సర్వీస్ ప్రొవైడర్: MetroPCS
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS
స్క్రీన్ సైజు: 2.8 inches
డిస్ ప్లే డిటేల్స్: 240-by-320-pixel, 262K-color TFT LCD capacitive touch screen
కెమెరా: Yes
కెమెరా పిక్సల్: 3.2 MP
కెమెరా ప్లాష్: No
బ్లూటూత్: Yes
వెబ్ బ్రౌజర్: Yes
ఫామ్ ప్యాక్టర్: Candy Bar
నెట్ వర్క్: CDMA
నెట్ వర్క్ బ్యాండ్స్: 850, 1900, 1700
మెమరీ స్టోరేజి కెపాసిటి: 137 MB
ప్రాససెర్ స్పీడ్: 528 MHz
బ్యాటరీ టాక్ టైమ్: 3 hours 53 minutes

హువాయ్ ఎమ్835 మొబైల్ ఎడిషన్ అమెరికన్ మొబైల్ మార్కెట్లోకి మెట్రో పిసిఎస్ అనే సర్వీస్ ప్రోవైడర్‌తో విడుదల కానుంది. ఈ మొబైల్‌ని యంగ్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేయడం జరిగింది. మొబైల్ చరిత్రలో ఇదో ల్యాండ్ మార్క్ డివైజ్‌గా నిలచిపోతుందని మొబైల్ తయారీదారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికన్ మార్కెట్లో ప్రవేశపెడుతున్న ఈ మొబైల్‌ని అతి త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టిందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot