Home
Mobile

అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న హువాయి Mate 20 Lite

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.

By Anil

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.ఈ నేపథ్యంలో Mate 20 Lite, Mate 20, Mate 20 Lite Pro పేర్లతో మరో మూడు కొత్తస్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయడానికి ప్లాన్ చేసింది.అయితే ప్రస్తుతానికి Mate 20 Lite ను మాత్రం లాంచ్ చేసింది.ఈ Mate 20, Mate 20 Lite Pro మొబైల్స్ ని మాత్రం మరి కొద్దీ రోజుల్లో లాంచ్ చేయనుంది . ఈ Mate 20 Lite మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతానికి పోలాండ్ మరియు జర్మనీ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కాగా ఇండియాకి అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో డ్యుయల్‌ రియర్‌ కెమెరాలను అమర్చింది. అలాగే 6.3 అంగుళాల డిస్‌ప్లేతో ప్రత్యకంగా ఉండనుంది. కాగా ఈ హువాయి Mate 20 Lite బ్లాక్ అండ్ బ్లూ కలర్స్‌లో వినియోగదారులను అలరించనున్నాయి. మరి ఫీచర్లు, ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ధర...

ధర...

ప్రస్తుతం ఈ హువాయి Mate 20 Lite జర్మనీ మరియు పోలాండ్ దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. జర్మనీ లో ఈ మొబైల్ ధర సుమారు రూ. 30,500 గా ఉంది.పోలాండ్ లో ఈ మొబైల్ ధర సుమారు రూ. 35,400 గా ఉంది.

డిస్‌ప్లే...

డిస్‌ప్లే...

6.3 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్....

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్....

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన quad-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ తో లభ్యమవుతోంది,256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE అదనపు ఆకర్షణలు.

కెమెరా....

కెమెరా....

నాలుగు కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది . బ్యాక్ కెమెరా విషయానికొస్తే 24+2 మెగాపిక్సల్ cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.అలాగే పవర్ ఫుల్ AI ఫీచర్స్ ఇందులో కలిపించారు. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 20+2 మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు

రెండు రంగుల్లో...

రెండు రంగుల్లో...

ఈ హువాయి Mate 20 Lite బ్లాక్ అండ్ బ్లూ కలర్స్‌లో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ.....

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ.....

ఈ హువాయి Mate 20 Lite స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3750 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంది

హువాయి  Mate 20 Lite ఫీచర్స్ .....

హువాయి Mate 20 Lite ఫీచర్స్ .....

6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌,ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో,4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 24+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,20+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా,3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Huawei Mate 20 Lite goes on sale ahead of launch.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X