ఈ నెలలో లాంచ్ అవుతున్న హువాయి మేట్ X ఫోల్డబుల్ ఫోన్

|

శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభించిన తరువాత ఇప్పుడు అందరి కళ్ళు హువాయి యొక్క ఫోల్డబుల్ ఫోన్ మీద ఉన్నాయి. హువాయి మేట్ X గా పిలువబడే కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ ఈ నెల అంటే అక్టోబర్‌ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హువాయి మేట్X యొక్క ఈవెంట్ లాంచ్ ఈ నెలాఖరులో చైనాలో జరుగుతుందని ఒక నివేదిక పేర్కొంది.

హువాయి
 

హువాయి మేట్X యొక్క ఫోన్ లాంచ్ మరియు సేల్స్ శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ కంటే ముందు ఆగస్టులో ప్రారంభమవుతాయని అందరు భావించారు కానీ అప్పటి నుండి ఇది ఆలస్యం అవుతోంది. నివేదికల ప్రకారం హువాయి మేట్ ఎక్స్ రెండు వేరియంట్ లలో విడుదల అవ్వవచ్చు. ఒక వేరియంట్ కిరిన్ 980 చిప్‌సెట్‌తో రావచ్చు మరియు మరొక వేరియంట్ అంతర్నిర్మిత 5G మద్దతుతో సరికొత్త కిరిన్ 990 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్స్ అంచనా

స్పెసిఫికేషన్స్ అంచనా

ఇప్పటివరకు మనం చూసిన దాని ఆధారంగా హువాయి మేట్ ఎక్స్ ఫోల్డబుల్ ఫోన్ మడవక మునుపు 8 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. గెలాక్సీ ఫోల్డ్ 7.3-అంగుళాల డిస్ప్లేతో పోల్చితే డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంది. ఫోల్డ్ మోడ్‌లో అంటే ఫోన్ ను మడిచినప్పుడు హువాయి మేట్ X 6.6-అంగుళాల మరియు 4.6-అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉంటుంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారంగా రన్ అవుతుంది. అంతేకాకుండా దీనికి 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మద్దతు ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కూడా వస్తుంది.

హువాయి

ఇతర దేశాలలో మేట్ X ను ప్రారంభించాలనే హువాయి ప్రణాళికలపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల దీని పోటీదారులు శామ్సంగ్ ఇండియాలో గెలాక్సీ ఫోల్డ్ ను ప్రారంభించింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ధర సుమారు రూ.1.65 లక్షలు. అధిక ధర ట్యాగ్ ఉన్నప్పటికీ ప్రీ-ఆర్డర్స్ కోసం ఉంచిన అన్ని యూనిట్లు కేవలం 30 నిమిషాల్లో ఫ్లాట్ అమ్ముడయ్యాయని శామ్సంగ్ పేర్కొంది. హువాయి మేట్ X ధర గెలాక్సీ ఫోల్డ్ కంటే తక్కువగా ఉండవచ్చు అని విశ్వసనీయ వర్గాలు తెల్పుతున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Huawei Mate X Foldable Phone Launch Expected in October Last Week

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X