హువాయి నుంచి 40 ఎంపీ ట్రిపుల్ లెన్స్, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ !

Written By:

ఇప్పుడు అంతా కెమెరా యుగం నడుస్తోంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు వినియోగదారులను కట్టి పడేస్తున్నాయి. ఈ విషయంలో ఐఫోన్‌ కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ దాని ప్రత్యర్థులు శాంసంగ్‌, గూగుల్‌, హువాయ్‌లు కెమెరా ఫోన్లకు పనిచెబుతూ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి. ఇందులో భాగంగా హువాయి కంపెనీ 40 ఎంపీ కెమెరాతో ముందుకు దూసుకువస్తోంది.

ఎయిర్‌టెల్ ప్లాన్లలో మార్పు, డేటా పరిమితి పెంపు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటోగ్రఫీ-సెంట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను..

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న రిపోర్టుల ప్రకారం హువాయి వచ్చే వారాల్లో ఫోటోగ్రఫీ-సెంట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాన్‌ బ్లాస్‌ కూడా కొత్త హువాయి స్మార్ట్‌ఫోన్‌పై ట్వీట్‌ చేశారు.

40 ఎంపీ ట్రిపుల్‌-లెన్స్‌ కెమెరా మోడ్యుల్‌

హువాయి కొత్తగా తీసుకురాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ వెనుక వైపు 40 ఎంపీ ట్రిపుల్‌-లెన్స్‌ కెమెరా మోడ్యుల్‌ను కలిగి ఉన్నట్టు తెలిపారు. సెల్ఫీ కెమెరా కూడా 24 మెగాపిక్సెల్‌ రూపొందుతుందని పేర్కొన్నారు.

పీ10, మేట్‌ 10 స్మార్ట్‌ఫోన్లకు..

స్మార్ట్‌ఫోన్‌కు జర్మన్‌ కెమెరా కంపెనీ లైకా కో-డెవలప్డ్‌గా సహకారం అందిస్తుందని ఇవాన్‌ బ్లాస్‌ ట్వీట్‌ చేశారు. హువాయ్‌ అంతకముందు విడుదల చేసిన పీ10, మేట్‌ 10 స్మార్ట్‌ఫోన్లకు కెమెరా మోడ్యుల్స్‌ను లైకానే అభివృద్ధి చేసింది.

తొలి ఫోన్‌ ఇదే

ట్రిపుల్‌ కెమెరా మోడ్యుల్‌ హ్యువాయ్‌ తీసుకురాబోతున్న తొలి ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. కాగా ఈ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లో హువాయి విజయవంతమవుతుందో లేదోనని టెక్‌ వర్గాలు ఆసక్తికరంగా వేచిచూస్తున్నాయి.

లైకాతో హువాయి గత కొన్నేళ్లుగా..

జర్మన్‌ కెమెరా తయారీదారి లైకాతో హువాయి గత కొన్నేళ్లుగా భాగస్వామ్యం కొనసాగిస్తోంది. లైకా భాగస్వామ్యంలో భారత్‌లో తొలిసారి విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ హువాయ్‌ పీ9.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei may soon launch a new smartphone with a 40 MP triple-camera module co-developed with Leica More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot