తక్కువ ధరకే బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్..?

Posted By: Prashanth

తక్కువ ధరకే బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్..?

 

తక్కువ ధరకే బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా..?, ‘హువావీ మెర్క్యురీ’ (Huawei Mercury) డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్‌ను ‘ట్రై’ చేసి చూడండి.. ఇది నిపుణులు సూచన

ఫోన్ పనితీరు మరియు ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వర్షన్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. లోడ్ చేసిన 1.4 GHz ప్రాసెసర్ మొబైల్ పనితీరును మరింత వేగరితం చేస్తుంది. 3జీ నెట్‌వర్క్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేయగలదు. ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా వీడియోలను మన్నికైన కోణంలో నిక్షిప్తం చేస్తుంది. డివైజ్‌లో పొందుపరిచిన మొబైల్ హాట్ స్పాట్ వ్యవస్థ ఏకకాలంలో 5 డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

ఫోన్ 4 అంగుళాల డిస్ ప్లే FWVGA టచ్ స్ర్కీన్ సౌలభ్యతతో పని చేస్తుంది. ఇంటర్నల్ మెమరీ 2జీబి, మైక్రో ఎష్డీ మెమరీ కార్డ్ ద్వారా జీబి శాతాన్ని పెంచుకోవచ్చు. వీడిమొ రికార్డింగ్ సౌలభ్యత, గ్యాడ్జెట్లో ముందుగానే బుల్ట్ చేసిన ‘వెబ్ బ్రౌజర్’ వేగవంతమైన నెట్ వర్కింగ్‌కు దోహదుపడుతుంది. ఆండ్రాయిడ్ మార్కెట్‌లోకి ప్రవేశించి వేలాది అప్లికేషన్లను యాక్సిస్ చేసుకోవచ్చు. పొందుపరిచిన బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వ్యవస్థలు ఫోన్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. వివిధ గుగూల్ సర్వీస్‌లను డివైజ్ సపోర్ట్ చేస్తుంది.

అత్యాధునిక ఫీచర్లతో, తక్కువ ధరకే లభ్యం కానున్న ‘హువావీ మెర్క్యురీ’ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర త్వరలోనే వెల్లడవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting