4 కెమెరాలతో Huawei Nova 2i
హువావే 'నోవా 2ఐ' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మొత్తం నాలుగు కెమెరాలతో ఇది మలేషియా మార్కెట్లో చక్కర్లు కొడుతోంది.
హువావే 'నోవా 2ఐ' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మొత్తం నాలుగు కెమెరాలతో ఇది మలేషియా మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. ఇండియాకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రిపోర్టుల ప్రకారం ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 13వ తేదీ నుంచి లభ్యం కానుందని తెలుస్తోంది. కంపెనీ దీని ధరను రూ.20,080గా నిర్ణయించింది.

హువావే నోవా 2ఐ ఫీచర్లు...
5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








