ఆగష్టు 23 నుంచి ఓపెన్ సేల్ కి రానున్న Huawei Nova 3
నాలుగు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి అత్యాధునిక ఫీచర్లతో లాంచ్ అయిన Huawei Nova 3 స్మార్ట్ ఫోన్ ఇప్పటివరకు ఫ్లాష్ సేల్ లో మాత్రమే అందుబాటులో ఉండేది.
నాలుగు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి అత్యాధునిక ఫీచర్లతో లాంచ్ అయిన Huawei Nova 3 స్మార్ట్ ఫోన్ ఇప్పటివరకు ఫ్లాష్ సేల్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఈ నెల 23 నుంచి అమెజాన్ లో ఓపెన్ సేల్ లో అందుబాటులోకి రానుంది. Huawei Nova 3 తో పాటు గత నెల జులై లో విడుదలయిన Nova 3i స్మార్ట్ ఫోన్ కూడా ఓపెన్ సేల్ లో అందుబాటులో ఉంటుంది. అయితే Nova 3i మాత్రం రేపటి నుంచే అంటే ఆగష్టు 21 నుంచే అందుబాటులోకి ఉంటుంది. Huawei Nova 3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ధరను కంపెనీ రూ.34,999 ధరతో లాంచ్ చేయగా 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ Nova 3i రూ.20,990 ధరతో లాంచ్ చేసింది.

ధర....
Huawei Nova 3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ధరను కంపెనీ రూ.34,999 ధరతో లాంచ్ చేయగా 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ Nova 3i రూ.20,990 ధరతో లాంచ్ చేసింది.

Huawei Nova 3 ఫీచర్లు....
6.3 ఆంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా,3750 ఎంఏహెచ్ బ్యాటరీ

Huawei Nova 3i ఫీచర్లు....
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా,3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఆఫర్లు....
అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ యూజర్లు రూ.3000 వరకు exchange ఆఫర్ పొందవచ్చు. నాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ యూజర్లు రూ.2000 వరకు exchange ఆఫర్ పొందవచ్చు. అలాగే American Express card తో కొనుగోలు చేసిన వారికి రూ. 3000 వరకు క్యాష్ బ్యాక్ లబిస్తుంది. రిలయన్స్ జియో యూజర్లకు 100 జీబీ ఉచిత డేటా తో పాటు రూ.1,200 క్యాష్ బ్యాక్ అలాగే రూ.3,300 ధర గల ఫ్రీ జియో వోచర్లు లభిస్తాయి.Huawei Nova 3i ను hdfc కార్డు తో కొనుగోలు చేసిన వారికి 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








