Home
Mobile

రూ. 21 వేలకే నాలుగు కెమెరాల స్మార్ట్‌ఫోన్

చైనా మొబైల్ దిగ్గజం హువాయి ఇండియాలో తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

By Hazarath Aiah

చైనా మొబైల్ దిగ్గజం హువాయి ఇండియాలో తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. నోవా 3 సిరీస్లో నోవా 3, నోవా 3ఐ పేరుతో రెండు డివైస్‌లను న్యూఢిల్లీ వేదికగా మార్కెట్లో లాంచ్‌ చేసింది. నాలుగు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. నాలుగు ఆర్టిఫిషియల్‌ క్వాడ్‌ కెమెరాలు, సొంతంగా 3డీ క్యు(ఎ)మోజీల సృష్టి తమ డివైస్‌ల ప్రత్యేకత అని లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనున్నామని హువావే ఇండియా ప్రతినిధి అనుపమ్‌ యాదవ్‌ తెలిపారు.

ధర

ధర

హువాయి నోవా 3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ధరను కంపెనీ 34,999 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ నోవా 3ఐ ధరను 20,990 రూపాయలుగా నిర్ణయించింది.

హువాయి నోవా 3 ఫీచర్లు

హువాయి నోవా 3 ఫీచర్లు

6.3 ఆంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా,3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ

హువాయి  నోవా 3ఐ ఫీచర్లు

హువాయి నోవా 3ఐ ఫీచర్లు

6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌,ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో,4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ప్రీ ఆర్డర్లు నేటి నుంచి

ప్రీ ఆర్డర్లు నేటి నుంచి

ఈ ఫోన్లకు సంబంధించి ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. హువాయి నోవా 3 స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 23 నుంచి, నోవా 3ఐ ఆగస్టు 7వ తేదీ నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

జియో యూజర్లకు ఉచిత డేటా

జియో యూజర్లకు ఉచిత డేటా

అలాగే 2 వేల రూపాయల ఎక్సేంజ్‌, రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు జియో యూజర్లకు ఉచిత డేటా లాంటి లాంచింగ్‌ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Huawei Nova 3, Nova 3i launch in India highlights: Nova 3i priced at Rs 20,990; Nova 3 worth Rs 34,999 more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X