కళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతం

ఇప్పుడు అంతా కెమెరా యుగం నడుస్తోంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు వినియోగదారులను కట్టి పడేస్తున్నాయి.

|

ఇప్పుడు అంతా కెమెరా యుగం నడుస్తోంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు వినియోగదారులను కట్టి పడేస్తున్నాయి. ఈ విషయంలో ఐఫోన్‌ కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ దాని ప్రత్యర్థులు శాంసంగ్‌, గూగుల్‌, హువాయిలు కెమెరా ఫోన్లకు పనిచెబుతూ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి. ఇందులో భాగంగా హువాయి కంపెనీ 40 ఎంపీ కెమెరాతో ముందుకు దూసుకువస్తోంది. ఇప్పటి వరకు డ్యూయల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్లు మాత్రమే మనల్ని అలరించగా ఇక నుంచి త్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కూడా మన ముందుకు రాబోతోంది. ప్రపంచపు తొలి త్రిపుల్‌ రియర్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి హువాయి సిద్ధమవుతోంది.

జియోని టార్గెట్ చేసిన Airtel, కొత్త ఆఫర్‌తో ఎంట్రీజియోని టార్గెట్ చేసిన Airtel, కొత్త ఆఫర్‌తో ఎంట్రీ

హువాయి పీ20, హువాయి పీ20 ప్రొ..

హువాయి పీ20, హువాయి పీ20 ప్రొ..

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మరో ముందడుగు పడబోతోంది. హువాయి పీ20, హువాయి పీ20 ప్రొ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను చైనా దిగ్గజం హువాయి భారత్‌లో లాంచ్‌ చేయబోతోంది. దీనికి సంబంధించి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇమేజ్‌ను టీజ్‌ కూడా చేసింది. ‘కమింగ్‌ సూన్‌ ఇన్‌ ఇండియా' ట్యాగ్‌లైన్‌తో కంపెనీ దీన్ని పోస్టు చేసింది.

పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు..

పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు..

పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఉండబోతోంది. త్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఒకటి 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్లో మోషన్‌ వీడియోను 720పీ రెజుల్యూషన్‌లో 960ఎఫ్‌పీఎస్‌ వద్ద రికార్డు చేస్తోంది.

ధర..
 

ధర..

కాగా హువాయి ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను మార్చి 27న పారిస్‌లో లాంచ్‌ చేసింది. హువాయి పీ20 ప్రొ అత్యధిక ధర 899 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.72000 ఉండొచ్చని అంచనా. ఈ ప్రొ వేరియంట్‌తోనే హువాయి తొలిసారి రూ.70వేల ధర మార్కును క్రాస్‌చేస్తోంది.

హువావే పీ20 ఫీచర్లు

హువావే పీ20 ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 హువావే పీ20 ప్రొ ఫీచర్లు

హువావే పీ20 ప్రొ ఫీచర్లు

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ OLED డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, octa-core Huawei HiSilicon Kirin 970 SoC, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్ల కెమెరాలు, 24.8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC, and USB Type-C, 4000mAh battery,7.8mm of thickness, fast charging technology, 30 నిమిషాల్లో 58 శాతం బ్యాటరీ ఛార్జ్.

Best Mobiles in India

English summary
Huawei P20, P20 Pro India Launch Will Be 'Soon', Says Company More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X